వివేకానందరెడ్డి మృతి తీరని లోటు

Suspicions about the death of Vivekananda

Suspicions about the death of VivekanandaReddy's death

– ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Date:15/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

మాజీ ఎంపి దివంగత వైఎస్‌.వివేకానందరెడ్డి ఆకస్మిక మరణం తీరనిలోటని ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం పుంగనూరులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. వివేకానందరెడ్డి మరణ వార్త తెలియగానే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయ నాయకుడిగా పేరుగాంచిన వివేకానందరెడ్డి మరణం పార్టీకి, ఆ ప్రాంత ప్రజలకు తీరనిలోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శులు రెడ్డెప్ప, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, ఆర్టీసి మజ్దూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, ఆర్‌విటిబాబు, కౌన్సిలర్లు అమ్ము, ఇబ్రహిం, నాయకులు కిజర్‌ఖాన్‌ , మునిరాజ, నానబాల మణి తదితరులు పాల్గొన్నారు.

కమలం పార్టీ ఆశలు నెరవేరేనా…. ?

Tags: Vivekananda Reddy’s death

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *