వివేకానందుడి జీవితం యువతకు స్పూర్తి

Date:12/01/2019
జగిత్యాల  ముచ్చట్లు:
వివేకానందుడి జీవితం యువతకు స్పూర్తి దాయకమని ,ఆయన స్పూర్తితో యువత దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని జిల్లా యువజన , క్రీడల అధికారి డాక్టర్ జి.నరేందర్ సూచించారు. శనివారం స్వామి వివేకానంద 156వ జయంతి పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని యువజన మరియు క్రీడల అధికారి కార్యాలయంలో గల స్వామి వివేకానంద మినీ స్టేడియంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా యువజన ,క్రీడల అధికారి జి.నరేందర్ పాల్గోని ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ యువత దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ,స్వామి వివేకానంద ఆశయ సాధనకు కృషి చేయలన్నారు.యువత సరైన మార్గంను ఎంచుకోని మంచి భవిష్యత్తు కోరుకోవాలని ఆన్నారు. ఈకార్యక్రమంలో రంగారావు ,కోరుకంటి రవి కుమార్ ,పిడిఎస్ పిడిలు ,పిఇటిలు కృష్ణ ప్రసాద్ , అజయ్ బాబు ,విద్యాసాగర్, వేణు ,యువజన నాయకులు విక్రం రెడ్డి, చోలేశ్వర్ ,మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
Tags:Vivekananda’s life is inspired by youth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *