ఎన్నికలు ఎదుర్కోలేకే వివేకా మృతిపై ఆరోపణలు

Vivekha's allegations against the election are unlikely

Vivekha's allegations against the election are unlikely

Date:15/03/2019
అమరావతి ముచ్చట్లు:
వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి బాధాకరమని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు.ఆయన మృతిపై లోతుగా దర్యాప్తు జరపాలని, తప్పు చేసిన వారిని ఉరి తీయాలన్నారు. ఎక్కడో జరిగిన దాన్ని మాకు ఆపాదించడం ఎంత వరకు సమంజసం? గతంలో కోడికత్తి కేసులో నాపై ఆరోపణలు చేశారు. వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. అభివృద్ధి విషయంలోనూ ఇలానే దుష్ర్పచారం చేస్తున్నారు. ఎన్నికలను నిజాయతీగా ఎదుర్కోలేకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.ఎక్కడ ఏం జరిగినా తెదేపా నేతలపై ఆరోపణలు చేయడం వైకాపాకు పరిపాటిగా మారిందని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఇతరులపై నెపం మోపి పబ్బం గడుపుకోవడం ఇకనైనా మానుకోవాలని ఆ పార్టీకి సూచించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగాశుక్రవారం మీడియాతో మాట్లాడుతూఎంపీ సీటు విషయంలో వైఎస్‌ కుటుంబంలో వివాదాలు ఉన్నాయి. వివేకా ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఓడిపోయినప్పటి నుంచి ఆయన ఆవేదనలో ఉన్నారు. అవినాశ్‌రెడ్డి, వివేకానందరెడ్డి మధ్య గొడవలు ఉన్నాయి. గతంలో విజయమ్మపైనా వివేకానందరెడ్డి పోటీ చేశారు. మొదట గుండెపోటు అని ఆ తర్వాత మాట మార్చారు. సీట్ల పంచాయతీలో మేం ఉంటే.. మాపై ఆరోపణలు చేయడం సమంజసమేనా? ఫ్యాక్షన్‌ వద్దని మేం రాజీపడి ప్రశాంతంగా ఉంటే మాపై ఆరోపణలా?గతంలో కోడికత్తి విషయంలో ఆరోపణలు చేశారు. అసలు నాకూ కోడికత్తికి ఏమైనా సంబంధం ఉందా?’’ అని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు. వాళ్లలో వాళ్లకు అంతర్గతంగా ఏమైనా ఉంటే వారు చూసుకోవాలే తప్ప రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని మంత్రి సూచించారు.
Tags:Vivekha’s allegations against the election are unlikely

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *