నెల్లూరు సోగ్గాడిగా వివేకా

Viveku as Nellore Sogga

Viveku as Nellore Sogga

Date:25/04/2018
నెల్లూరు  ముచ్చట్లు:
ఆనం వివేకనందరెడ్డి.రాజకీయల్లో ఆంధ్ర,తెలంగాణ ల్లో ఒకప్పుడు వెల్ నోటేడ్ పర్సన్.పిల్లలకు,మహిళలకు సూపర్ ఎంటర్ టైన్ మెంట్ పోలిటికల్ లీడర్.యూత్ కు స్టైల్ లీడర్.ఆరవై ల్లో కూడ ఇరవైలా ఉంటు గ్లామర్ గ ఉండాలని ఆరాటపడే నేత.ప్రత్యర్దులకు పవర్ ఫుల్ పంచ్ లు,వ్యంగ్యంగా విమర్సలు విసురుతూ ఆనం నోటికి జడుసుకోనేలా చేసే లీడర్.పోలిటికల్ ప్రత్యర్దులను అర్దికంగ,మానసికంగ దెబ్బకోట్టడంలో రాక్షసంగ వ్యవహరిస్తాడు.ఇంక చాల చెప్పోచ్చు ఆయనదో విలక్షణమైన వ్యక్తిత్వం…మాటతీరు అంతే…వేషధారణతో ఇట్టే ఆకట్టుకుంటారు. నెల్లూరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్‌గా పేరొందిన ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ఆయనే ‘ఆనం వివేకానందరెడ్డి’. నెల్లూరు జిల్లా సొగ్గాడుగా పేరొందిన ‘ఆనం వివేకానందరెడ్డి’ కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడితోపాటు హస్తం పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు.
తెలుగు రాజకీయాల్లో సమయానుసారంగా గెటప్పులు మార్చే రాజకీయ నాయకులు కొద్దిమందే ఉన్నారు. అయితే గెటప్పులు మార్చినప్పటికీ సదరు నాయకులు ఒరిజినల్‌ పాత్రధారులతో కనెక్టవ్వాలని ఏం లేదు కదా. పాత్రలతో పెర్ఫెక్ట్ మ్యాచ్‌ అయ్యే నాయకుల జాబితా అతి తక్కువగా ఉంటే అందులో మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఒకరు. తనదైన పంచ్‌లతో మీడియాలో నిలిచే ఆనం తన సోదరుడు రామనారాయణ రెడ్డితో కలిసి కొద్దిరోజుల క్రితం టీడీపీలో చేరారు.అడే చేయ్యి,వాగే నోరు ఉరకఉండదంటారు.రాజకీయ నేత అన్న వాడు మంచిగానో,చెడ్డగానో నిత్యం ప్రజల్లో,మీడియాలో ఉండాలనేది రాజకీయ సూత్రం.ఈ పోలిటికల్ పాయింట్ ను బాగ ఫాలో అవుతారు ఆనం వివేకనంద రెడ్డి.వివేక నోటి పవర్ ను,పోలిటికల్ గ ఆనం కు ఉన్న క్రేజ్ ను ధృష్టిలో ఉంచుకోని అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆనం బ్రదర్స్ ను ప్రత్యర్దుల పై బ్రహ్మస్త్రల్లా వాడేవారు.స్వపక్షంలో ఉన్న నేదురుమల్లి,విపక్షంలో ఉన్న కెసిఆర్ ల పై వైయస్.. ఆనం వివేక ను గిరీగిరీ మరి విమర్సలు చేయించేవారు.ఇంతటినోటిపవర్,పోలిటికల్ విమర్సల్లో అరితేరిన ఆనం వివేకను వాడుకోవడంలో టిడిపి నాయకత్వం దారుణంగ ఫెయిల్ అయ్యిందనేది పోలిటకల్ టాక్.ఆరోగ్యం పెద్దగ సహకరించకున్న రాజకీయం అంటే ఉషారు,ఓపిక తెచ్చుకుంటారు. అన్నగారి పార్టీలో చేరినప్పుడు ఆనం వివేకా ఇపుడు గెటప్‌ మార్చారు. కొత్త తరహాలో మీసం గీసుకొని మీడియా ముందుకువచ్చారు. ఆనం వివేకా స్టైల్‌ చూస్తే లెజెండ్‌ లాగా ఉందని కొందరు అంటుంటే లయన్‌ సినిమాలో బాలయ్య బాబులాగా ఉన్నారని మరికొందరు అంటున్నారు. ఈ పొగడ్తలకు వివేక వారు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. మరో యాంగిల్‌లో వివేక వారు వీరప్పన్‌లాగా ఉన్నారని కొందరు సంబరపడుతున్నారు. ఆనం వివేకా తన వస్త్రాధరణతో వీరప్పన్‌ను మరిపిస్తున్నప్పటికీ ఆ పేరుతో పిలిస్తే మాత్రం ఆయన తెగ ఇబ్బంది పడిపోతున్నారు. తనను నాయకుడిలాగా చూడటాన్ని ఇష్టపడతానని చెప్తున్నారు.వివేకానందరెడ్డి మృతితో సింహపురి చిన్నబోయింది. సుమారు రెండు నెలలకు పైగా మృత్యువుతో పోరాడిన ఆయన ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు ప్రజలు విషాదంలో మునిగిపోయారు. రాజకీయాల్లో విలక్షణ నేతగా గుర్తింపు తెచ్చుకున్న వివేకానందరెడ్డి.. ప్రజల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి ఏ విషయంపై అయినా ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడేవారు. నెల్లూరులో ధర్నా చేయాలన్నా, ప్రతి పక్షాలపై ఎదురుదాడి చేయాలన్నా ఆయన తర్వాతే అనే పేరుంది. వైఎస్సార్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. వైఎస్ స్వయంగా మంత్రి పదవి ఇస్తానని ఆహ్వానించినా వినమ్రంగా తిరస్కరించి తన తమ్ముడు ఆనం రామనారాయణ రెడ్డికి ఇప్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల మధ్య ఉండే వివేకా రోజూ సెకండ్ షో చూసి ఇంటికెళ్లేవారు. ఇక భోజన విషయంలో ఏమాత్రం రోజూ రెండు పూటలా బిర్యానీ ఉండాల్సిందే.2007లో వై.యస్‌. క్యాబినెట్‌లో పెద్దవాడిగా వివేకా అడిగితే మంత్రి పదవి వచ్చే అవకాశమున్నా ఆయన ఆనాడు తనకు కాకుండా తన తమ్ముడి కోసమే మంత్రి పదవి అడిగి సోదరుల పట్ల తన వాత్సల్యం చాటుకున్నారు. వై.యస్‌. కొలువులో రామనారాయణరెడ్డి మంత్రి అయ్యాక ఆనం జోరు పెరిగింది. 2009 ఎన్నికలనాటికి నేదురుమల్లిపై పైచేయి సాధించారు. వై.యస్‌. మరణానంతరం తొలిరోజుల్లో జగన్‌కు అండగా నిలిచి ఆయన తరపున గట్టిగా పోరాడిన వివేకా ఆ తర్వాత కొద్దిరోజులకే తన వాణిని మార్చారు. జగన్‌కు వ్యతిరేకంగా గళం విప్పారు.  తెలుగుదేశం నాయకులు కూడా జగన్‌పై ఆరోపణలు చేయనంతగా వివేకా ఆరోపణలు చేసారు. జగన్‌పై వివేకా చేసిన ఆరోపణలను ఆయన అనుచరులు, అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోయారు. వై.యస్‌. మరణంతో ఆనంకు ఓ రకంగా రాజకీయ గ్రహణం పడితే, కొన్ని రోజులుగా ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దీనితో టిడిపి సభ్యులు..కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు సంతాపం తెలియచేశారుఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందిస్తున్నామని చంద్రబాబుకు కిమ్స్‌ వైద్యులు వివరించారు. వెంటిలేటర్‌పై జీవిస్తున్న ఆయన ఆరోగ్యం ఇటీవలే మరింతగా క్షీణించింది. ఆయన భౌతికకాయాన్ని నెల్లూరు జిల్లాకు తరలించనున్నారు. గురువారం అంత్యక్రియలు జరిపే అవకాశం ఉంది.ఆనం వివేకానందరెడ్డి 1950 డిసెంబర్ 25వ తేదీన జన్మించారు. ఇతనికి ఇద్దరు కుమారులున్నారు. 199, 2004, 2009లో ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకంటే ముందు మున్సిపల్ ఛైర్మన్ గా వ్యవహరించారు. మున్సిపల్ ఛాంబర్ గా కూడా పనిచేసిన ఆనం వివేకా ప్రభుత్వంతో పోరాడి సమస్యలను పరిష్కరించే విధంగా చూశారు.
TAgs:Viveku as Nellore Sogga

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *