వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందే

Date:21/05/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఎన్డీయేతర పక్షాల నేతలు కలిశారు.అనంతరం, మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, కొన్ని రోజులుగా ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేశామని అన్నారు. మొత్తం వీవీ ప్యాట్స్ లెక్కించేందుకు ఈసీకి సమస్యేంటి అని  ప్రశ్నించారు. ఎన్నికల పోలింగ్ లో పారదర్శకత, ప్రజల్లో విశ్వాసం కల్పించడం ఈసీ బాధ్యత అని అన్నారు. తాము లేవనెత్తిన సమస్యలు చిన్నవి కావని, దీనికి ఈసీ వెంటనే పరిష్కారం చూపకుంటే ఈ సమస్య మరింత పెద్దది అవుతుందని అన్నారు.
ఏపీ సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో.. విప‌క్షాల స‌మావేశం ముగిసింది ఢిల్లీలో కాన్‌స్టూష‌న్ క్ల‌బ్ ఆఫ్ ఇండియాలో భేటీ మొద‌లైంది. డీఎంకే నేత క‌నిమొళి, బీఎస్పీ నేత ద‌నిష్ అలీ, రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, అభిషేక్ మ‌నూ సంఘ్వీలు స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఎన్డీయే కూట‌మికి వ్య‌తిరేకంగా విప‌క్షాలు ఒక‌వేదిక‌పై వ‌చ్చాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలుబ‌డిన త‌ర్వాత తీసుకోవాల్సిన చ‌ర్య‌లు గురించి విప‌క్ష నేత‌లు చ‌ర్చిస్తున్నారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ స్లిప్పుల‌ను కూడా లెక్కించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. నేత‌లంతా ఈ అంశంపై ఇవాళ ఎన్నిక‌ల సంఘాన్ని క‌ల‌వ‌నున్నారు. సీపీఎం నేత సీతారం ఏచూరి, టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్‌, ఆర్జేడీ నేత మ‌నోజ్ జా, ఎన్సీపీ నేత మ‌జీద్ మీమ‌న్‌, ఎన్‌సీ నేత దేవింద‌ర్ రాణాలు కూడా స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.

 

 

 

 

 

 

 

రాహుల్ డుమ్మాఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల తర్వాత విపక్షపార్టీలు ఢీలా పడినట్టు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి గెలుస్తుందని ఎగ్జిట్స్‌ పోల్స్‌ ఫలితాలు ప్రకటించడంతో హస్తినలో రాజకీయా సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. విపక్షపార్టీల మధ్య దూరం పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తించిన తీరు, 50 శాతం వీవీప్యాట్‌ల లెక్కింపుపై చర్చించేందుకు మంగళవారం స్థానిక కాన్స్టిట్యూషన్‌ క్లబ్‌లో విపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నేతలు అభిప్రాయపడ్డారు. అయితే రాహుల్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక సీఎంలు మమతా బెనర్జీ, కుమారస్వామి, యూపీ ఆగ్రనాయకులు అఖిలేష్‌ యాదవ్‌, మాయావతి‌ ఎన్సీపీ అధ్యక్షుడు శరదపవార్‌లు సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హంషాకిచ్చిన కుమార స్వామిటీడీపీ అధినేత చంద్రబాబుకు కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఊహించని షాకిచ్చారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కుమారస్వామి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఢిల్లీలో ఈవీఎంల అంశంపై చర్చించేందుకు విపక్షాలు సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఐతే, ఈసీ వద్ద నిరసన కార్యక్రమానికి కుమారస్వామి దూరంగాఉంటారని జేడీఎస్‌ వర్గాలు తెలిపాయి.

 

 

 

 

 

 

ఢిల్లీ పర్యటనకు కుమారస్వామి వెళ్లడంలేదని ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా వెల్లడించింది. చంద్రబాబు ఈసీపై పదేపదే ఆరోపణలు చేస్తూ దుప్ప్రచారానికి దిగుతుండటంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే.ఎన్డీయేతర నేతలు ఈసీని కలవనున్నారు. కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న ధోరణిపై విపక్ష నేతలు చర్చించారు. పోలింగ్‌ తర్వాత పరిణామాలు, ఎగ్జిట్‌పోల్స్‌, ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు జాతీయ స్థాయిలో ఏ నేతా పిలవకున్నా, పనిగట్టుకుని వెళుతున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల పరువు తీస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సీ రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. ఎగ్జిట్ పోల్స్ తనకు ప్రతికూలంగా రావడంతో తట్టుకోలేకపోతున్న చంద్రబాబు, తన ఓటమిని ఈవీఎంలపై నెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని అన్నారు.  సుప్రీంకోర్టు నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించడం సిగ్గు చేటని, రాజ్యాంగ వ్యవస్థకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని విమర్శలు గుప్పించారు. గడచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించిన ఆయన, చంద్రబాబు దేశమంతా తిరిగినా ప్రయోజనం కలగబోదని, ఆయన హుందాతనాన్ని ఏనాడో కోల్పోయారని, అందుకే విపక్షాల సమావేశానికి చంద్రబాబును పక్కకు పెట్టారని ఎద్దేవా చేశారు.

 

 

100 శాతం లెక్కింపు కుదురదు

 

Tags: Vivi pets should be calculated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *