కాంట్రావర్శీకి దారి తీసిన వీసీ కామెంట్స్

Voice comments leading to contraversy

Voice comments leading to contraversy

Date:08/10/2018
ముంబై  ముచ్చట్లు:
మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో గానీ, శ్లోకాలు ఉచ్చరిస్తే పంటలు మాత్రం వృద్ధిచెందుతాయట.. ఈ మాట అన్నది ఏ స్వామీజీనో, పండితుడితో కాదు, సాక్షాత్తు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప-కులపతే ఇలా వ్యాఖ్యానించడంతో విమర్శలు చెలరేగుతున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ పంజాబీరావు దేశ్‌ముఖ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ విలాస్ భాలే చేసిన వ్యాఖ్యలపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కొద్ది రోజుల కిందట అంతర్- విశ్వవిద్యాలయాల యువజనోత్సవాలను ఈ వర్సిటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన వీసీ భాలే, భారతీయ కళలు, సంస్కృతి గొప్పతనాన్ని వివరించారు.
భారత శాస్త్రీయ సంగీతం గొప్పదనాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయని, దీనివల్ల గోవుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. తబలా, వేణువు లయలు సంగీతంలో ఎంతో ముఖ్యమైనవని తెలిపారు. అలాగే శ్లోకాలను ఉచ్చరించితే పంటలు సైతం అభివృద్ధి చెందుతాయని వ్యాఖ్యానించారు. దీంతో దుమారం రేగింది. విదర్భలోని అనేక రైతు సంఘాలు భాలే వ్యాఖ్యలను తప్పుబడుతున్నాయి. శాస్త్రవేత్త అయి ఉండి కూడా మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని దుయ్యబడుతున్నారు. వీసీ తన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని మూఢ-నమ్మకాల నిర్మూలన సమితి డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన వీసీ, నా శరీరం ఓ పరిశోధనాలయం… ప్రయోగపూర్వకంగా ఏదైనా విషయాన్ని అంగీకరిస్తాను.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, మంత్రాల వల్ల పంటలు పండుతాయని నేను ఎక్కడా చెప్పలేదని అన్నారు. శ్లోకాలను కేవలం సంగీతంతో ముడిపెట్టి మాత్రమే మాట్లాడానని స్పష్టం చేశారు.
Tags:Voice comments leading to contraversy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed