కోవిడ్ కట్టడికి స్వచ్చంద సంస్థలు సహకరించాలి..!!

_కోవిడ్ తాత్కాలిక చికిత్సాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే

_రూ.37.86 కోట్ల ఉచిత పంటల బీమా

_కఠినంగా కర్ఫ్యూను అమలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు..

 

వరదయ్యపాలెం ముచ్చట్లు :

 

కోవిడ్ కట్టడికి స్వచ్చంద సంస్థలు ప్రభుత్వానికి బాసటగా నిలిచి ప్రజల ప్రాణాలు రక్షించడంలో ప్రధాన భూమిక పోషించాలని నియోజకవర్గ స్థాయిలో నోడల్ అధికారులతో సమన్వయ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ సేవలను ప్రజలకు చేర్చడంలో స్వచ్చంద సంస్థలు వారధిగా ఉండాలని చిత్తూరు జిల్లా సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం ఆకాంక్షించారు.. బుధవారం వరదయ్యపాలెం మండల కేంద్రంలోని గోవర్ధన పురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోవిడ్ తాత్కాలిక చికిత్సాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జెసి వీరభద్రం తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే చికిత్సాలయం ను ప్రారంభించి సేవలను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా స్థానిక మీడియా మిత్రులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆదిమూలం…మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఓవైపు.. కర్ఫ్యూ అమలు చేస్తూనే, అవసరాలకు సరిపడా వ్యాక్సిన్లు సకాలంలో దేశీయంగా లభించనందున వ్యాక్సిన్ల కొనుగోలు కోసం గ్లోబల్‌ టెండర్లు నిర్వహించాలని నిర్ణయించింది. తద్వారా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు వేగవంతం చేసేలా అడుగులు వేస్తోంది. అదే విధంగా.. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయాలను అన్వేషించి ఆక్సిజన్‌ నిల్వలను పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

 

 

 

 

జ్వరాల ఇంటింటి సర్వేపై ఇప్పటికే సంబంధిత అధికారులకు దిశా నిర్ధేశం చేశామన్నారు. సర్వేలో భాగంగా వలంటీర్లు, ఆశా కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరిగి జ్వరపీడితులను గుర్తించి ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలుంటే ఆ విషయాన్ని సంబంధిత ఏన్‌ఎన్‌ఎంకు తెలియజేసి వారికి మెరుగైన వైద్య సేవలు పొందే విధంగా ఎప్పటికప్పుడు వలంటీర్ల యాప్‌లోనూ అప్‌లోడ్‌ చేస్తూ, కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని అవసరాన్ని బట్టి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో గానీ, ఆస్పత్రిలో గానీ చేస్తున్నామన్నారు, కరోనా లక్షణాలేవీ లేని వారిని, ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న వారిని, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారిని 14 రోజుల వరకు హోం క్వారంటైన్‌లో ఉంచి వారికి అవసరమైన మందుల కిట్‌ ఇచ్చి ఏఎన్‌ఎం ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో పంట నష్టపోయిన 1,19,548 మంది రైతులకు వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రూ.37.86 కోట్ల లబ్ధి చేకూరిందని ఎమ్మెల్యే తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయల్లో, వ్యాపార సముదాయలు వద్ద నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు.

 

 

 

 

 

అన్ని చోట్ల ధర్మల్ గన్స్, శానిటేజర్స్ అందుబాటులో ఉంచినట్లు ఎమ్మెల్యే వివరించారు. అన్ని ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్ లో ఎక్కువ ఫీజులు వసూలపై వస్తున్న పిర్యాదులపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహారిస్తుందని స్పష్టం చేశారు. మాస్క్ లేకుండా బైట తిరిగితే రూ. 100 ఫైన్ కూడ అమలులో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు RTPCR పరీక్షలును ఏపీప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. అన్ని కోవిడ్ హాస్పిటల్స్ కు నోడల్ ఆఫీసర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చర్యలు తీసుకుంటున్నారని ఆదిమూలం వెల్లడించారు…. ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం మండలానికి చెందిన వైఎస్ఆర్ సీపీ ముఖ్యనాయకులు, అధికారులు, వైసిపి పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

 

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: Voluntary organizations should cooperate for the construction of Kovid .. !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *