యథేచ్ఛగా బాణా సంచా సామగ్రి అమ్మకాలు
-నిబంధనలకు తూట్లు..పట్టించుకోని అధికారులు
శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో ఏర్పాటు చేసిన దీపావళి సామాగ్రి షాపులో నిబంధన ఖాతరు చేయడం లేదు. అధికార పార్టీ అండతో ప్రజల ప్రాణాల మీదకి ప్రమాదం ఏర్పడుతుందని తెలిసిన అధికారులు కనీసంపర్యవేక్షించడం లేదు .స్టాల్స్ వద్ద కచ్చితంగా ఏర్పాటు చేయవలసిన మెడికల్ భద్రతా సామాగ్రిని ఏర్పాటు చేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. లైసెన్స్ పేరుతో అధిక ధరలతో ప్రజలనుదోచుకుంటున్న పట్టించుకునే వారే కరువయ్యారని పలువురు వాపోతున్నారు. భద్రత వైఫల్యంతో విజయవాడలో దీపావళి సామాగ్రి దగ్దమై ఇద్దరు సజీవ దహనం అయిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగాచర్చినియాసమైన కనీసం అధికారులు కళ్ళు తిరిగిపోవడం దారుణం. భద్రత విషయమై అగ్నిమాపక శాఖ అధికారులను వివరణ అడిగినప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ఏదైనా జరిగితే అప్పుడుచూసుకుంటామంటూ సమాధానం చెప్పడం లో అధికారుల వైఖరి ఏమిటో అర్థమవుతుంది ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా టెక్కలి ఏర్పాటు చేసిన దుకాణాలను సీజ్
చేయాలని పలువురు కోరుతున్నారు.
Tags: Voluntary sales of fireworks