పుంగనూరు నియోజకవర్గంలో వలంటీర్ల ఇంటర్వ్యూలు ప్రారంభం

Volunteer interviews begin in Punganur constituency

Volunteer interviews begin in Punganur constituency

Date:11/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని గ్రామ పంచాయతీ వలంటీర్ల నియామకాలకు గురువారం ఆయా మండల అధికారులచే ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉద్యోగాలకు అధిక సంఖ్యలో ధరఖాస్తులు అందడంతో అధికారులు పంచాయతీల వారిగా ఇంటర్వ్యూలు నిర్వహించారు.

పుంగనూరు….

మండలంలోని 23 పంచాయతీలలో వలంటీర్ల నియామకాలకు గురువారం ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, తహశీల్ధార్‌ సుబ్రమణ్యంరెడ్డి , ఈవోఆర్‌డి వరప్రసాద్‌, డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు కలసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభించారు. మండలంలో వెహోత్తం 291 ఉద్యోగాలకు గాను 1240 మంది నిరుద్యోగులు ధరఖాస్తు చేశారు. 1:4 నిష్పత్తిలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. తొలుత మండలంలోని ఏటవాకిలి, నేతిగుట్లపల్లెతాండ, నల్లగుట్లపల్లె పంచాయతీలలోని వలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలను మదనపల్లె సబ్‌కలెక్టర్‌ చేకూరి కీర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఇంటర్వ్యూలను పరిశీలించారు. అధికారులతో చర్చలు జరిపారు.

12న ఇంటర్వ్యూలు జరిగే గ్రామాలు…

పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం రెండవ రోజు ఇంటర్వ్యూలు ఉదయం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు తెలిపారు. మండలంలోని ఆరడిగుంట, బోడేవారిపల్లె, ఏతూరు, ఏటవాకిలి, సింగిరిగుంట గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు చేపడుతున్నామన్నారు. అభ్యర్థులు తమ ఒరిజనల్‌ రికార్డులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.

విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి

Tags; Volunteer interviews begin in Punganur constituency

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *