రెన్యువ‌ల్ కోసం వాలంటీర్ల ఎదురుచూపులు

Date:14/09/2020

 

న‌ల్గొండ‌ ముచ్చట్లు:

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యా వాలెంటర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విద్యాసంవత్సరం ప్రారంభమైనా నేటి వరకూ రెన్యూవల్‌ చేయక పోవడంతో వారు తమను ఈ సారి తీసుకుంటారా లేదా అనే ఆందోళనలో ఉన్నారు. గత నెల 27వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఉపాధ్యా యులు రెగ్యులర్‌గా పాఠశాలకు వెళ్తున్నారు. విద్యా వాలెంటీర్లను మాత్రం ఇటు ప్రభుత్వం గానీ, ఇటు అధికారులు గానీ ఇప్పటి వరకూ పిలవలేదు.జిల్లాలో మొత్తంగా 1025 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 75,446 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మెజార్టీ పాఠశాలలో ఇప్పటికీ ఉపాధ్యాయుల కొరత వేధిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే విద్యా వాలంటీర్లు అరకొర జీతాలతోనే ఆ కొరతను భర్తీ చేస్తూ విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుండి నేటికీ ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో విద్యావాలంటీర్ల పరిస్థితి దయనీయంగా మారింది. తమను ఈ సంవత్సరం కూడా కొనసాగిం చాలని కోరుతూ ఇప్పటికే వాలెంటర్ల్లు జిల్లా కలెక్టర్‌ వినరు కృష్ణారెడ్డి, డీఈవో మదన్‌మోహన్‌లకు వినతి పత్రాలు అందజేసి వేడుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదంటూ అధికారులు పేర్కొంటున్నారు.

 

జిల్లాలో 2018 -19 విద్యా సంవత్సరానికి గాను 400 విద్యా వాలెంటీర్ల పోస్టులు ఖాళీగా ఉండగా 400 పోస్టులను భర్తీ చేశారు. ఇందులో 100 మంది వరకు ఇతర ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. మిగతా 300 మంది మాత్రం విద్యావాలెంటీర్‌గా కొనసాగుతున్నారు. తమను ఏటా రెన్యువల్‌ చేయాలని కోరుతూ విద్యా వాలెంటర్లు గత సంవత్సరం కోర్టును ఆశ్రయించారు. దీంతో రెగ్యులర్‌ ఉపాధ్యాయులు వచ్చేవరకు వీరినే ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు 2019- 20 విద్యా సంవత్సరం వారిని రెన్యూవల్‌ చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈనెల 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆగస్టు 27వ తేదీ నుంచి విధులకు హాజరవుతున్నారు. వాలంటీర్లకు మాత్రం ఎలాంటి ఆదేశాలూ అందలేదని, కోర్టు ఆదేశాల మేరకు ఈసారి కూడా తమను రెన్యువల్‌ చేయాలని వారు కోరుతున్నారు.కోర్టు తీర్పుతో గతేడాది విద్యావాలెంటీర్లను ప్రభుత్వం కొనసాగించింది. ఈ సారీ రెన్యూవల్‌ చేయాలి. రెగ్యులర్‌ ఉపాధ్యాయులు వచ్చేంత వరకు వాలంటీర్లను కొనసాగిం చాలి. విద్యార్థులు తరగతులు నష్టపోకుండా చూడాలి. అన్ని విద్యార్హతలు రోస్టర్‌ పాయింట్‌ ఆధారంగా నియామకాలు చేపట్టినా మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం సరికాదు. జూన్‌ ఒకటో తేదీ నుంచి కనీసం సగం వేతనమైనా ఇవ్వాలి.

 

మళ్లీ ఆగిన మల్లన్న సాగర్ పనులు

Tags:Volunteers’ expectations for renewal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *