వలంటీర్లు బాధ్యతగా పని చేయాలి

Volunteers must act responsibly

Volunteers must act responsibly

– మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌

Date:06/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామ పంచాయతీలలో నూతనంగా నియమితులైన వలంటీర్లు క్రమశిక్షణతో , బాధ్యతగా పని చేయాలని మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం వలంటీర్ల శిక్షణ తరగతులను ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి లు హాజరైయ్యారు. ఈ శిక్షణలో వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగ సమస్యలేకుండ చేసేందుకు ఎక్కడి నిరుద్యోగులకు అక్కడే ఉప్యాధి కల్పించేందుకు వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. వలంటీర్లు ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొచ్చేలా కృషి చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు పేదలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఖాదర్‌బాషా, హేమచంద్రతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

6వ జాతీయ కరాటేలో బంగారు పతకాలు

Tags: Volunteers must act responsibly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *