Volunteers must work with the government S

ప్రభుత్వానికి వారదులుగా వలంటీర్లు పని చేయాలి

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:27/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గ్రామ పరిపాలనకు శ్రీకారం చుట్టిందని , ఇందులో వలంటీర్లు ప్రభుత్వానికి వారదులుగా పని చేయాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ సూచించారు . సోమవారం పట్టణంలో వార్డు సెక్రటరీలకు, వలంటీర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా సీఐ గంగిరెడ్డి, డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు, ట్రాన్స్కో ఏఈ శశికుమార్‌ హాజరైయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, వలంటీర్లు బాగస్వామ్యులుకావడం అభినందనీయమన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేలా ప్రతి ఒక్కరు అంకితబావంతో పనిచేయాలని సూచించారు. నవరత్నాల పథకాలను పేదలందరికి అందించి , ప్రభుత్వానికి మంచిపేరు తీసుకువచ్చేలా కృషి చేయాలని కోరారు. సీఐ గంగిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వీటిని వలంటీర్లు తమకు తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరు స్వేచ్చగా జీవించేలా తీసుకునే చర్యల్లో వలంటీర్లు బాగస్వామ్యులుకావడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో విధులు నిర్వహించి , భవిష్యత్తులో ఉత్తములుగా పేరు సంపాదించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ డీఈఈ వెంకట్రమణ, టౌన్‌మిషన్‌ కోఆర్డినేటర్‌ రవికుమార్‌, మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, ఆర్‌వో రామకృష్ణ, ఆర్‌ఐ తిరుమలరావు పాల్గొని వలంటీర్లుకు వివిధ రకాల సూచనలు, సలహాలు అందజేశారు.

సచివాలయాలలో పండుగ కళ

Tags: Volunteers must work with the government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *