కమలానికి  ఓటు బ్యాంకు రాజకీయాలు

విజయవాడ ముచ్చట్లు:

 

 

బీజేపీ నేతృత్వరంలోని ఎన్డీయే సర్కార్ మంత్రివర్గ విస్తరణపై అదిరిపెయే సెటైర్లు వేశారు టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కేంద్ర క్యాబినెట్‌లో ఏపీకి కనీసం చోటు దక్కకపోవడంపై ఆయన సునిశిత విమర్శలు చేశారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. తెలుగు ప్రజలకి న్యాయం చేయాలనే తపన ఏ మాత్రం లేకపోవడం శోచనీయమని ఆయన అన్నారు.ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూసిందని.. కేవలం సీట్లు, ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప తెలుగు ప్రజలకి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాలకు లేకపోవడం శోచనీయమని బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర క్యాబినెట్ కూర్పుతో ఆంధ్రాలో ఇప్పట్లో ఎన్నికలు లేవని అర్థమైందన్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తే మినహా బీజేపీ మనవైపు చూడదన్నమాట.! అంటూ సెటైర్లు విసిరారు. ఓహో అదిరిందయ్యా పుష్పములు అంటూ కమలం పార్టీని ఎద్దేవా చేశారు.
పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Vote bank politics for Kamal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *