Natyam ad

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి జగనన్నను గెలిపించండి

పుంగనూరు ముచ్చట్లు:

ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి రెండవ సారి ముఖ్యమంత్రిగా జగన్నను గెలిపించాలని పలువురు ప్రచారాలు చేశారు. శుక్రవారం పట్టణంలోని రాగానిపల్లెరోడ్డు, బిలాల్‌ మసీదువీధిలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా ప్రచారం చేశారు. అలాగే సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, ఎంబిటి రోడ్డు, ఎన్‌ఎస్‌.పేట, కుమ్మరవీధిలో ఈవిఎంలపై అవగాహన కల్పించారు. దళిత సంఘ నాయకులు శంకరప్ప , ఎస్సీ,ఎస్టీ మానటరింగ్‌ కమిటి సభ్యుడు రాజు ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, కౌన్సిలర్‌ కాళిదాసు కలసి ఈవిఎంలపై అవగాహన కల్పించారు. పిఆర్‌ఆర్‌ వారియర్స్ డాక్టర్లు శరణ్‌, శివ లు ప్రచారం చేశారు. బలిజ సంఘ నాయకులు కొండవీటి నాగమణి, కౌన్సిలర్‌ గంగులమ్మ, నానబాల గణేష్‌, మణి, రాయల జగదీష్‌ , త్యాగరాజు, గోపి, రవి, సాగర్‌, మాగాండ్లపల్లి ప్రభాకర్‌ లు ప్రచారం చేశారు. అలాగే ఎంబిటి రోడ్డులో ముస్లింనాయకురాలు రహత్‌జాన్‌, ముబినా, హైదర్‌అలి. షాతాజ్‌, అయిషా, జరీన్‌తాజ్‌లు ఇంటింటా ప్రచారం చేశారు. కరపత్రాలు ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ విజయంతో గెలిపించాలని కోరారు.

Post Midle

Tags: Vote for the fan symbol and make Jaganan win

Post Midle