బీజేపీపై వాయిస్ పెంచిన మంత్రులు

Date:15/03/2018
లక్నో ముచ్చట్లు:
ఉత్తర ప్రదేశ్‌, బీహార్ ఉప ఎన్నికల్లో పరాభవం పాలైన బీజేపీపై విమర్శల వాన కురుస్తోంది. బీజేపీ పతనానికి ఇదే ఆరంభం అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించగా.. ఆ పార్టీ పాలనా వైఫల్యానికి ప్రజలు ఇచ్చిన తీర్పు అని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ ఫలితాలపై టీడీపీ ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. విభజన హామీలు నెరవేర్చకుండా ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తున్న బీజేపీకి ఉత్తర్‌ప్రదేశ్‌లో గట్టి దెబ్బ తగిలిందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.‘గోరఖ్‌పూర్‌లో తెలుగు వారు అధికంగా ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనేక మంది గోరఖ్‌పూర్‌కు వలస వెళ్లారు. వీరందరూ బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారు. ఏపీకి బీజేపీ చేసిన అన్యాయం, మోసం ప్రభావం అక్కడ పడింది. ఆ పార్టీకి తెలుగు ప్రజల ఉసురు తగులుతుంది. కర్ణాటకలోనూ ఇవే ఫలితాలు ఎదురవుతాయి’ అని ఆంజనేయులు అన్నారు.మరో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ.. మోసం ఒక రాష్ట్రానికి చేసినా, ఒక వ్యక్తికి చేసినా మోసమేనన్నారు. బీజేపీకి ఈ ఓటమి ఒక గుణపాఠం కావాలన్నారు. ఈ ఫలితాల తర్వాత అయినా ఆ పార్టీ వైఖరిలో మార్పు రావాలని, ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని ఆయన కోరారు.‘ఆంధ్రప్రదేశ్‌తో మాకు పనిలేదు, యూపీ ఉందని బీజేపీ భ్రమపడింది. ఇవాళ సీఎం సొంత నియోజకవర్గంలోనే పరాభవం ఎదురైంది. తెలుగు వారికి జరిగిన అన్యాయం పక్క రాష్ట్రాల వారికి అర్థమైంది. అందుకే బీజేపీ ఓడిపోయింది’ అని సత్యనారాయణ అన్నారు.
Tags: Vote on the BJP is ministers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *