మొబైల్ యాప్‌ ద్వారా ఓటరు స్లిప్పు

Voter slip through mobile app

Voter slip through mobile app

Date:14/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మొబైల్ యాప్‌ ద్వారా ఓటరు స్లిప్పును పొందే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. టెపోల్  యాప్‌ ద్వారా ఓటరు స్లిప్పులను పొందవచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని ప్లేస్టోర్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌ ద్వారా జిల్లా పేరు, ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేస్తే ఓటరు స్లిప్పు వస్తుంది. వెబ్‌సైట్ ద్వారా కూడా ఓటర్ స్లిప్పు పొందే అవకాశం కల్పించిన రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా.. యాప్ ద్వారా కూడా పొందే అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలోని 12,732 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 1న షెడ్యూలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి విడతగా 197 మండలాల్లో 4480 పంచాయతీల్లోని ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికోసం జనవరి 7 నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జనవరి 13తో ముగిసింది. నామినేషన్ల పర్వం పూర్తవడంతో..  ప్రచారం ఊపందుకోనుంది. షెడ్యూలు ప్రకారం జనవరి 21, 25, 30 తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. జనవరి 11న మొదలైన రెండో దశ 25న, 16న మొదలయ్యే మూడో దశ జనవరి 30తో ముగుస్తుంది.
Tags:Voter slip through mobile app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *