Natyam ad

రోడ్డు..వేస్తేనే ఓట్లు

నల్గొండ ముచ్చట్లు:

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీలు, ప్రజల కాళ్లు మొక్కైనా ఓట్లు అడగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు ముందస్తుగానే తమ డిమాండ్లను వినూత్నంగా తెలుపుతున్నారు. మునుగోడులోని చండూరు మండలంలో ఎన్నో ఏళ్లుగా సరైన రహదారి లేక పడమటితాళ్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఓటు కోసం వచ్చే నాయకులకు ముందపస్తుగానే తమ డిమాండ్లను తెలియజేయాలని వినూత్న ఆలోచన చేశారు. ‘నో రోడ్‌.. నో ఓట్‌’అని ముద్రించిన ఫ్లెక్సీలను తయారు చేసి ప్రదర్శించారు. రోడ్డు వేయించిన నేతకు తమ గ్రామప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని, లేదంటే ఓటు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.చండూరు మండలం పడమటి తాళ్ల గ్రామ ప్రజలకు నా పూర్తి మద్దతు తెలుపుతున్నానంటూ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గం ప్రజలు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ప్రజా ప్రతినిధులను రాజీనామా చెయ్యాలని నిలదీయాలంటూ రాజగోపాల్ రెడ్డి కోరారు. ‘ నేను మూడున్నర ఏళ్లుగా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి ఏలాంటి పోరాటం చేసినా తెలంగాణ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకుండే. అందుకే రాజీనామ చేసి కేసీఆర్ మెడలు వంచి అభివృద్ధి పనులు చేయిస్తున్నాను!’ అంటూ ట్వీట్ చేశారు.

 

Tags: Votes only if you cast the road

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.