Natyam ad

బిజెపి, తెలుగుదేశంకు ఓటు వేస్తే మతకల్లోలాలే

-జగనన్నతోనే అభివృద్ధి , సంక్షేమం
-ప్రశాంతమైన పుంగనూరులో కులాల చిచ్చు రేపుతారు
-సూట్‌కేసుతో వచ్చిన కిరణ్‌ను అలాగే సాగనంపాలి
– పుంగనూరు అభివృద్ధిని అడ్డుకుంది కిరణ్‌, బాబులే
– కార్యకర్తలకు అండగా ఉంటా
– ఎంపీ మిధున్‌రెడ్డి ఆవేదన

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఉమ్మడి పార్టీలుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం , బిజెపిలకు ఓటు వేస్తే మత కల్లోలాలు సృష్టిస్తారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌ లు పుంగనూరు అభివృద్ధిని అడ్డుకున్నారు. హిందూముస్లింలు సోదర బావంతో జీవిస్తున్నామని , ఉమ్మడి అభ్యర్థులు వస్తే కులాల చిచ్చు రేపి అశాంతితో కొట్టుకోవాల్సి వస్తుందని రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం పట్టణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి నాయకులతో చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి సమావేశమయ్యారు. ఎంపీ మాట్లాడుతూ ప్రశాంతమైన పుంగనూరులో బిజెపి ఓటు వేస్తే టీడీపీకి వేసినట్టే ….టీడీపీకి ఓటు వేస్తే బిజెపికి వేసినట్లే అని, ఈ విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. పుంగనూరుపై ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న అభిమానంతో వేలాది కోట్ల రూపాయలు విడుదల చేసి అభివృద్ధి చేశారని కొనియాడారు. పుంగనూరు ప్రజలకు తాగునీరు , సాగునీరు అందించేందుకు మంచినీటి ప్రాజెక్టులు నిర్మిస్తుంటే వాటిని చూసి సహించలేక కోర్టులలో స్టేలు తెచ్చి ఆపివేశారని తెలిపారు. అలాగే మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి పుంగనూరుకు మంచినీరు ఇవ్వకుండ , రోడ్డు పనులు ఆపివేయడంతో ఆనాడు రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాజెక్టుల సాధనకై పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. అభివృద్ధి విఘాతుకులుగా ఉన్న వారికి ఓట్లు అడిగే అర్హతే లేదన్నారు. చిత్తూరు జిల్లా వాసులుగా ఉన్న కిరణ్‌, బాబులు జిల్లా అభివృద్ధికి కృషి చేయలేదన్నారు. అలాంటి వారు ఎన్నికలలో మాయమాటలు చెప్పి , ప్రజలను మోసగించేందుకు మత తత్వపార్టీలతో పొత్తులు పెట్టుకోవడం బాధకరమన్నారు. ఆపార్టీలు వస్తే పౌరసత్వంతో పాటు అన్ని రకాల మత తత్వ చట్టాలు తీసుకొచ్చి, మైనార్టీలకు రక్షణ లేకుండ చేస్తారని తెలిపారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా ఉన్న తనకు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రెండవ సారి ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించుకోవాలన్నారు. జగనన్న లేకపోతే సంక్షేమం ఆగిపోతుందని , కల్లోలం తాండవం చేస్తుందని మిధున్‌రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, రెడ్డెప్ప, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగారాజారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2న జగనన్న సభను జయప్రదం చేయండి…

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 2న మదనపల్లెకు వస్తున్నారని , ఆసభను జయప్రదం చేయాలని ఎంపీ మిధున్‌రెడ్డి కోరారు. జగనన్నకు పుంగనూరుపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా మనం ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. ఈ మేరకు అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని సూచించారు.

కైసాబై….

తుమే…కైసాబై …అంటు అప్యాయంగా ముస్లిం మైనార్టీలతో ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ముచ్చటించుకున్నారు. పట్టణ పర్యటనలో భాగంగా మైనార్టీలు నాయకులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులకు ఓట్లు వేసేది లేదని మైనార్టీలు ఎంపీకి హామి ఇచ్చారు.

 

Tags: Voting for BJP and Telugu is like religion

Post Midle