ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది

-జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారి రవి పట్టన్ షెట్టి

Date:25/01/2020

కర్నూలు ముచ్చట్లు:

ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారి రవి పట్టన్ శెట్టి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమీపంలో వున్న గాంధీ విగ్రహం వద్ద పదవ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారి రవి పట్టన్ షెట్టి, జాయింట్ కలెక్టర్ 2 సయ్యద్ కాజా మొహిదీన్, డిఆర్ఓ పుల్లయ్య లు జాతీయ ఓటర్ల దినోత్సవం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. గాంధీ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా రాజ విహార్ సర్కిల్ వద్దకు చేరుకుని అనంతరం మానవహారంగా ఏర్పడి జాయింట్ కలెక్టర్ 2 సయ్యద్ కాజా మొహిదీన్, జిల్లాస్థాయి అధికారులు, విద్యార్థులచే ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ రాజ్ విహార్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ సమావేశ మందిరం వరకు ర్యాలీ జరిగింది.  ర్యాలీలో  సమాచార పౌర సంబంధాల శాఖ ఉపసంచాలకులు తిమ్మప్ప, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, డ్వామా పిడి వెంకటసుబ్బయ్య, సేట్కూరు సీఈవో నాగరాజు నాయడు, డి సి ఓ రామాంజనేయులు,  జిల్లాస్థాయి అధికారులు, ఎన్ సి సి క్యాడెట్లు, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు, వికలాంగులు, జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీపీసీలోకి ఆర్టీపీసీ విలీనం

Tags: Voting is very valuable in a democracy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *