Natyam ad

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విఆర్ఓ ఎల్లయ్య..

పీలేరు ముచ్చట్లు:

 

పీలేరు నియోజకవర్గం, కె.వి పల్లి మండలంలో ఓ రైతు నుంచి విఆర్ఓ లంచం తీసుకుంటుండగా కడప ఏసిబి డిఎస్పి గిరిధర్ శనివారం మధ్యాహ్నం వలపన్ని పట్టుకున్నారు.కేవిపల్లి మండలం సొరకాయల పేట సచివాలయంలో వీఆర్వో గా పని చేస్తున్న ఎల్లయ్య గోరంట్ల పల్లి గ్రామం బసిరెడ్డి వద్ద మ్యుటేషన్ కొరకు 9వేల రూపాయలు లంచం అడుగగా 5వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని కడప ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించారు. వారి సూచనల మేరకు ఎల్లయ్యకు రైతు బసి రెడ్డి 5వేల రూపాయలు లంచం ఇవ్వడంతో తీసుకున్న ఎల్లయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.కేసు నమోదు చేసి రికార్డులను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలను కడప ఏసీబీ డిఎస్పీ గిరిధర్ తెలపాల్సి ఉంది.

 

Tags; VRO Ellaiah caught by ACB officials while taking bribe..

Post Midle
Post Midle