పుంగనూరు పేకాటలో పట్టుబడ్డ వీఆర్‌వో నాగేశ్వర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టపగలు ఓలాడ్జిలో పేకాట ఆడుతూ మండలంలోని వనమలదిన్నె వీఆర్‌వో నాగేశ్వర్‌రెడ్డి అడ్డంగా పట్టుబడిన సంఘటన మంగళవారం పట్టణంలో జరిగింది. పట్టణంలోని లాడ్జిలో వీఆర్‌వో తో పాటు మరో 6 మంది పేకాట ఆడుతుండగా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.10500ల నగదు స్వాదీనం చేసుకుని , హెడ్‌కానిస్టేబుల్‌ కేశవరాజు ఆధ్వర్యంలో క్రైమ్‌ నెంబరు:337/2024గా కేసు నమోదు చేశారు. ఈ మేరకు 41 సీఆర్‌పిసీ నోటీసులు జారీ చేసి , పేకాట రాయుళ్లను విడుదల చేశారు. ఈ మేరకు కోర్టుకు, ఉన్నతాధికారులకు సమాచారం పంపారు. కాగా పుంగనూరు , పరిసర గ్రామాలలో పేకాట తీవ్రంకావడంతో జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.

 

Tags: VRO Nageshwar Reddy caught in Punganur poker

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *