రద్దుకానున్న వీఆర్వో పోస్టులు
నిజామాబాద్ ముచ్చట్లు:
నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు షాక్ ఇచ్చింది. గ్రూప్ –4లో పదివేలకుపైగా పోస్టులను రద్దు అవుతున్నాయి. ఏండ్ల నుంచి కొట్లాడుతున్న వీఆర్ఓలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తుండటంతో.. గ్రూప్–4 కింద భర్తీ చేసే పోస్టులకు గండి పడుతోంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ గ్రూప్ –4లో ఖాళీగా చూపిస్తున్న దాదాపు 3 వేల వీఆర్ఓ పోస్టులు కూడా రద్దు అవుతున్నాయి. సర్దుబాటులో 7,309 పోస్టులు, వీఆర్వో కింద భర్తీ చేయాల్సిన 3వేల పోస్టులు మొత్తంగా 10 వేల పోస్టులకు ఎసరు పెట్టారు. గ్రూప్–4 కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు షాక్ తగిలింది. ఇప్పుడు ముగుస్తున్న వీఆర్ఓల వ్యవస్థను కొత్తగా జూనియర్అసిస్టెంట్ ఈక్వల్కేటగిరీల్లో నియమించనున్నారు.రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గ్రూప్ –1, పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, చాలా మంది గ్రూప్ –4 ఉద్యోగాలపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ స్థాయిలోనే ఎక్కువ పోస్టులు భర్తీ కానున్నాయి. జిల్లా కేడర్‌లో చాలా పోస్టులుంటాయని ఇప్పటికే తేలింది. దీనిలో ముందుగా 9168 గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి ఇచ్చింది. జాబితా సిద్ధమైన తర్వాత మరోసారి ఫైనాన్ష్ డిపార్ట్మెంట్నుంచి జీవో ఇస్తే.. ఆ తర్వాత నోటిఫికేషన్ఇవ్వడమే.
ప్రస్తుతానికి ఆయా శాఖల నుంచి భర్తీ చేయాల్సిన ఈ పోస్టులపై వివరాలు సేకరిస్తున్నారు. ముందుగా 9168 పోస్టులకు నోటిఫికేషన్ఇచ్చిన తర్వాత.. మలి విడుతలో మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్ రావాల్సి ఉంది.వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉన్న ఉద్యోగులనే జిల్లాలకు సర్దుబాటు చేశారు. కొత్త మండలాలు, కొత్త జిల్లాల్లో ఈ పోస్టుల దాదాపు 21 వేలు ఖాళీలున్నట్లు అధికారులు ఇప్పటికే తేల్చారు. దీనిలో ముందుగా 9168 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలుండగా.. ఇప్పుడు అసలు సమస్య ముందుకొచ్చింది. వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరందరినీ గ్రూప్–4లోని జూనియర్అసిస్టెంట్, సీనియర్అసిస్టెంట్హోదాల్లో తీసుకోనున్నారు. వీళ్లందరికీ ఇప్పటికే గుర్తించిన ఖాళీల్లో భర్తీ చేయనున్నారు. అవసరమైతే కొన్ని సూపర్న్యూమరీ పోస్టులు కూడా ఏర్పాటయ్యే చాన్స్ఉంది. అయితే, డిగ్రీ చేసి గ్రూప్–4 కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు లక్షల మంది ఉన్నారు. గ్రూప్ –4 కింద దాదాపు 21వేల పోస్టులున్నట్లు పీఆర్‌సీ నివేదిక సైతం వెల్లడించింది. అటు సీఎం కేసీఆర్కూడా అసెంబ్లీలో 80 వేల పోస్టుల భర్తీ ప్రకటన చేశారు. దీంతో 20వేల పోస్టులు గ్రూప్ –4 కింద ఉండటంతో..

చాలా మంది వీటి కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ఇప్పుడు నోటీఫికేషన్ ఇచ్చే 9 వేల పోస్టులకే గ్రూప్ –4 ఆఖరు కానుంది. ఎందుకంటే వీఆర్వోల సర్దుబాటు తర్వాత జిల్లాలు, మండలాలు, జిల్లా కార్యాలయాల్లో ఖాళీలు కనిపించవు. వీఆర్వోలతో వాటిని నింపుతుండటంతో.. కొత్త పోస్టులు ఉండవు. కేడర్ స్ట్రెంత్ ప్రకారం ఉద్యోగుల ఖాళీలు లెక్కేయాల్సి ఉండగా.. ప్రభుత్వం దాన్ని ముట్టుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే వీఆర్వోల సర్దుబాటుతో తక్షణం 7,309 పోస్టులు ఖాళీల జాబితా నుంచి రద్దు కానున్నాయి. ఆ తర్వాత గ్రూప్ –4 కింద భర్తీ చేయాల్సిన పోస్టులను ఇప్పటి వరకు వీఆర్వోల పోస్టుల కింద దాదాపు 3 వేలున్నాయి. దీంతో సర్దుబాటుతో 7వేలు, భర్తీ జాబితాలో సూచించిన 3 వేల పోస్టులు మొత్తం భర్తీ జాబితా నుంచి రద్దు అవుతున్నాయి.గ్రూప్ –4 నోటిఫికేషన్‌కు అటు టీఎస్ పీఎస్సీ కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో సాంకేతిక సమస్యలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే తొలి విడుతలో 9168 పోస్టుల భర్తీపై సవాలక్ష సమస్యలు వస్తున్నాయి.
ఒక్కో విభాగంలో ఖాళీల సంఖ్యకు, భర్తీ చేయాల్సిన వాటికి పొంతన లేకుండా పోయింది. దీంతో విడుతలు వారీగా జాబితా ఇవ్వాల్సి వస్తోంది. దీనికి ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం రావడంతో.. ఈ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ వస్తుందంటూ ప్రభుత్వం ప్రకటిస్తోంది. దీంతో నిరుద్యోగులు కూడా ముందుగా 9వేల పోస్టులు, ఆ తర్వాత మరో 11 వేల పోస్టులు గ్రూప్ –4 కింద ఉంటాయని ప్రిపేర్ అవుతున్నారు. కానీ, వీటిలో 10 వేల పోస్టులు రద్దు అవుతున్నాయి. దీంతో జిల్లా కేడర్ వారీగా గ్రూప్ –4 కింద ఇప్పుడు సర్దుబాటు చేస్తున్న వీఆర్వోల వివరాలు, గతంలో గుర్తించిన ఖాళీలన్నీ తీసి, కొత్త జాబితా సిద్ధం చేయాల్సి ఉంటోంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే.. గ్రూప్ –4 ఖాళీలు, భర్తీ చేయాల్సిన పోస్టులపై తుది జాబితా రానుంది.
Tags: VRO posts to be abolished
