విట్టల్ వాడి మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసిన డాషింగ్ డైరెక్టర్ వి.వి.వినాయక్

VV Vinayak is the dashing director who has released the Vittal Wadi Movie Trailer
Date:03/12/2019
రోహిత్,సుధా రావత్ హీరో హీరోయిన్లు గా ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో జి.నరేష్ రెడ్డి నిర్మించిన చిత్రం విట్టల్ వాడి. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్బంగా డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ ట్రైలర్ చాలా బావుంది.డైరెక్టర్ నాగేందర్ కి మంచి పేరు రావాలి ప్రొడ్యూసర్ కి డబ్బులు బాగా రావాలి అని కోరుకుంటున్నాను.రోహిత్ కి మంచి భవిష్యత్తు ఉంది, అలాగే మూవీ కి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి అల్ ది బెస్ట్ అని చెప్పారు. ప్రొడ్యూసర్ నరేష్ రెడ్డి గారు మాట్లాడుతూ విట్టల్ వాడి మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన వి.వి.వినాయక్ కి చాలా చాలా థాంక్స్…ఈ మూవీ మీ అందరికి నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. డైరెక్టర్ నాగేందర్ మాట్లాడుతూ మా మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన కమర్షియల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కి చాలా థాంక్స్.. విట్టల్ వాడి మూవీ లో హీరో గా చేసిన రోహిత్ మాట్లాడుతూ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన వి.వి.వినాయక్ కి చాలా చాలా థాంక్స్…ఈ కార్యక్రమం లో పాల్గొన్న రైటర్ ఆకుల శివ మాట్లాడుతూ రోహిత్ ఈ మూవీ లో అద్భుతంగా నటించాడు.ప్రొడ్యూసర్ నరేష్ రెడ్డి నా ఫ్రెండ్… ఖర్చు కి వెనకాడకుండా ఈ సినిమా ని నిర్మించారు.చిత్ర యూనిట్ అందరికి నా బెస్ట్ విషెస్ అని తెలిపారు. నటీనటులు: రోహిత్ రెడ్డి,సుధా రావత్,అమిత్,అప్పాజీ అంబరీష్ దర్బా,చమ్మక్ చంద్ర,జయ శ్రీ,రోల్ రైడా.
Tags:VV Vinayak is the dashing director who has released the Vittal Wadi Movie Trailer