వైయస్సార్ బీమా నమోదు ఈ నెల 25 వరకు గడువు పొడిగింపు
అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
డిఆర్డీఏ పిడి మధుసూదన్ రెడ్డి
కడప ముచ్చట్లు:
వై.యస్.ఆర్ బీమా నందు కొత్త రైస్ కార్డ్ ల నమోదు మరియు గత సంవత్సరం నమోదు చేసుకున్న లబ్ధి దారుల యొక్క రెన్యువల్ చేసుకొనుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం గడువు తేదిని 25 వరకు పొడిగించడమైనదని జియస్ డబ్ల్యుఎస్ అడిషనల్ కమిషనర్ గారు నిర్వహించిన టెలి కాన్ఫెరెన్స్ నందు చెప్పినట్లు డిఆర్డీఏ పిడి మధుసూదన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. . కావున జిల్లాలోని అందరూ యం పిడిఓ మరియు మునిసిపల్ కమిషనర్ లు తమ పరిధిలోని గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు వాలేంటీర్లకు తగు సమాచారం ఇచ్చి అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని వై.యస్.ఆర్ బీమా నందు నమోదు చేసేలా తగు చర్యలు తీసుకొనవలసినదిగా కోరడమైనది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ వద్ద ఉచితంగా భీమా నందు నమోదు చేసుకోవాల్సినదిగా ఆ ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags: Vyassar Insurance Registration Extension till 25th of this month
