Natyam ad

వడ్డే ఓబన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

జగిత్యాల ముచ్చట్లు:

స్వాతంత్ర్య సమరయోధులు వడ్డే ఓబన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, భావితరాల వారికి ఆయన పోరాట ప్రతిమలు తెలియజేయాలని ధర్మపురి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం రోజున వడ్డే ఓబన్న 217 వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి ముఖ్య అతిథిగా పాల్గొన్న విప్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మొట్టమొదటి సారిగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 1807 జనవరి 11 న కర్నూల్ లో జన్మించిన ఆయన పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. 10 వేల మందితో సైన్యం ఏర్పాటు చేసుకొని  బ్రిటీష్ సైన్యంతో పోరాడిన మహోన్నత వ్యక్తి అని అభివర్ణించారు. ఒడ్డెర కులస్తులకోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. రాష్ట్రంలో నివసిస్తున్న ఒడ్డెర కులస్తుల కష్ట సుఖాలు పరిశీలించి వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహకారం అందజేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఒడ్డెర కుటుంబాల్లోని భార్యాభర్తలు కష్టపడి జీవితం సాగించేవారని అన్నారు. ఒద్దేరాలను ఎస్టి జాబితాలో చేర్పించడానికి ముఖ్యమంత్రి దృష్టికి తిసుకువస్తానని తెలిపారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఆరుగ్యారంటీల పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. జిల్లాలోని ఒడ్డెర కులస్తులకు సహకారం అందిస్తామని తెలిపారు. పేదల సంక్షేమం, జిల్లా సమగ్రాభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.ఆనంతరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్  దావ వసంత మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో చరిత్ర సృష్టించిన ఓబన్న చరిత్ర ప్రతీ ఒక్కరు  తెలుసుకోవాలని అన్నారు. కష్టాలనే నమ్ముకున్న ఒడ్డెర కుటుంబాలను ప్రభుత్వం నుండి సహకారం అందించాలని కోరారు. స్వేచ్చ, సమానత్వం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి అని అభివర్ణించారు.ఆనంతరం
జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. గొప్పవారిని స్మరించుకొని స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు. వడ్డే కులస్తుల సామజిక ఆర్ధిక స్థితిగతులు పెంపొందించే దిశగా అడుగులు వేయాలని అన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిసి బంధు పథకాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు.ఆనంతరం
అదనపు కలెక్టర్ బి.ఎస్. లత మాట్లాడుతూ మహోన్నతులు, స్వాతంత్ర్య సమరయోధులు జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదని, వడ్డెర ఓబన్న జయంతి వేడుకను మొట్ట మొదటి సారిగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. వడ్దేరులు కష్టపడేతత్వం ఉందని, స్వతంత్ర జీవులని, ఓర్పు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఆనాటి ఉద్యమకారుల చరిత్రను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని అన్నారు.ఆనంతరం
ఒడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొగిలయ్య మాట్లాడుతూ కర్నూల్ జిల్లాలో పుటిన ఓబన్న ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, శిస్తుల వసూళ్లకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని అన్నారు. భవన నిర్మాణాలకు అవసరమైన రాయి కొట్టడం ఒడ్డెర కులస్తుల జీవనోపాధి అని అన్నారు. కష్టార్జితంతోనే జీవనం సాగిస్తారని అన్నారు. ఆధునిక యోగంలో క్రషర్స్ రావడంతో జీవనోపాధి కష్టతరంగా మారిందని అన్నారు. ప్రభుత్వాలు ఒడ్డెర కులస్తులకు జీవనోపాధి కల్పించాలని కోరారు. అలాగే ఎస్టి జాబితాలో ఒడ్డెర కులస్తులను చేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో బి.సి. సంక్షేమ అధికారి సాయిబాబా, మున్సిపల్ ఇంచార్జీ చైర్మన్ గోలి శ్రీనివాస్, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్, బి.సి, ఒడ్డెర కుల సంఘాల నాయకులు, కలెక్టరేట్ లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Wadde Obanna’s life should be taken as an example

Post Midle