అవిశ్వాస పరీక్ష పై వాడీ వేడి చర్చ

Modi's link with Essar is a family that has been accused of massive scam

Modi's link with Essar is a family that has been accused of massive scam

 Date:20/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ పై అవిశ్వాస పరీక్షలో వాదనలు, ప్రతివాదనలుతో వాతావరణం ఒక్కసారి వేడెక్కింది.  గల్లా జయదేవ్ ప్రసంగంపై  బీజేపీ  ఎంపీ కౌంటర్ ఇచ్చారు. మరో వైపు రాఫెల్ విమానాల కొనుగోలు విషయంలో రాహుల్ ఆరోపణలను మంత్రి నిర్మలా  సీతారామన్ తప్పుపట్టారు.  రహస్య ఒప్పంద పత్రాలను సభలో ప్రవేశపెట్టలేమన్నారుఅవిశ్వాస తీర్మానం పై జరిగిన చర్చలో ఆరోపణలు.. ప్రత్యారోపణలుకు దారి తీశాయి. రాఫెల్‌ విమానాల కొనుగోలు విషయంలో అర్థం లేని ఆరోపణలు చేయడం సమంజసం కాదని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. రాఫెల్‌ విమానాల కొనుగోలుపై గోప్యత పాటించాలని 2008లోనే ఒప్పందం జరిగిందన్నారు. నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సంతకం చేసిన పత్రాలను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ సభలో ప్రవేశపెట్టారు. వాణిజ్యపరమైన ఒప్పందం వల్లే పూర్తి వివరాలను వెల్లడించమలేమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడే స్వయంగా చెప్పారని సభకు తెలిపారు. కాగా, రహస్య ఒప్పంద పత్రాలను సభలో ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తంచేయగా.. అవి అప్పటి రక్షణ మంత్రి సంతకం చేసిన ప్రతులు మాత్రమేనని సీతారామన్‌ తెలిపారు.మరో వైపు విభజన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీలు ఇస్తే… ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడమేమిటని బీజేపీ ఎంపీ రాకేశ్‌ సింగ్‌ ప్రశ్నించారు. ప్రజలు విశ్వసించిన ప్రభుత్వంపై ప్రజల నమ్మకం కోల్పోయిన పార్టీలు తెచ్చిన అవిశ్వాసమన్నారు. స్వాతంత్య్రం వచ్చాక 60 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీయే దేశాన్ని పాలించిందని… 48 ఏళ్లపాటు నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌, మన్మోహన్‌ల నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగిందన్నారు. 48ఏళ్ల స్కాముల ప్రభుత్వాలను 48 నెలల్లోనే స్కీముల ప్రభుత్వంగా మార్చామన్నారు.తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారని, వాటిని తిరిగి తెలంగాణకు ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌ డిమాండ్‌చేశారు. ఏపీ కడుతున్న పోలవరం విషయంలో తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ ప్రాజెక్టులకు కూడా పోలవరం తరహాలో కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, హైకోర్టు విభజన వంటి విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.పోలవరం కోసం నిధులు కావాలని  టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కోరారు. వారు అడిగిన నిధులు కేంద్రం ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు. ప్రధాని చొరవ తీసుకుని తెలంగాణ ప్రాజెక్టులకు కూడా నిధులు ఇవ్వాలన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారానికి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏమీ జరగలేదన్నారు.ఎక్కడ ఎన్నికలొచ్చిన బీజేపీ ఓడిపోతూనే ఉందని టీఎంసీ ఎంపీ సౌగత్‌రాయ్‌ ఎద్దేవాచేశారు. ప్రధాని మోదీ ఒక పర్యాటకుడిలా మారిపోయారని ఆరోపించారు. బెంగాల్‌లో టీఎంసీ ఉన్నంతకాలం దుర్గా పూజ చేసే పరిస్థితులు కూడా ఉండవంటూ మోదీ మతపరమైన ఏకీకరణకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. లలిత్‌మోదీ, నీరవ్‌మోదీ, పెద్ద మోదీ సిండికేట్‌గా మారి దేశాన్ని లూటీ చేస్తున్నారని సౌగత్‌రాయ్‌ మండిపడ్డారు. నోట్ల రద్దుతో ఒరిగిందేమీలేదని, బ్లాక్‌ మనీ అంతా వైట్‌ మనీగా మారిందని దుయ్యబట్టారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తానని ఒక్క రూపాయి తేలేదని, బీజేపీ ఆర్థిక విధానాలు దేశాన్ని నాశనం చేశాయని ఆయన మండిపడ్డారు. దేశంలో బ్యాంకుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో యువతకు ఉపాధి కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ విమర్శించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ములాయం మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించట్లేదని, ఈ ప్రభుత్వ చర్యలతో రైతులు, వ్యాపారులు, యువత ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. యూపీలో, కేంద్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాలు నడుస్తున్నాయని, ఇవి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలని మండిపడ్డారు. యూపీ లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి ఓటు వేసిన రైతులే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చే ప్రయత్నం చేయాలని ములాయం డిమాండ్ చేశారు.మొత్తానికి ఏపీ విభజన అంశంపై లోక్ సభలో అవిశ్వాసంపై చర్చలో గల్లా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, లోక్ సభ, రాజ్యసభలలో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని… ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీని, బీజేపీని తాము ఒప్పించామని… తదనంతరం పార్లమెంటు ఉభయసభల్లో బిల్లు పాస్ అయిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా, అశాస్త్రీయంగా జరిగిందని ఎలా అంటారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను డిమాండ్ చేశారు.
అవిశ్వాస పరీక్ష పై వాడీ వేడి చర్చ https://www.telugumuchatlu.com/wadi-heated-debate-on-untruth-test/
Tags:Wadi heated debate on untruth test

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *