తప్పుడు సంకేతాలతో వైకాపా మభ్యపెడుతోంది

-శాసనసభలో చంద్రబాబు

Date:19/07/2019

అమరావతి  ముచ్చట్లు:

విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ తెచ్చింది తెదేపానే అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్ సంస్కరణలు తెదేపా ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తు చేశారు. గతంలో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంటే పూర్తిగా దాన్ని రూపుమాపామని చెప్పారు. కానీ, ప్రస్తుతం మళ్లీ కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు. రికార్డుల ఆధారంగానే మాట్లాడుతున్నానని, వైకాపా సభ్యులు తప్పుడు సంకేతాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

 

 

 

పీపీఏలపై వైకాపా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని చంద్రబాబు చెప్పారు. ‘కర్ణాటకలో జగన్కు డెవలపర్గా ఎక్కువ ధర కావాలట. ఇక్కడ మన రాష్ట్రానికి మాత్రం అవసరం లేదా?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కర్ణాటక విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ భవానీ ప్రసాద్ ఇచ్చిన కాపీని సభలో చదివి వినిపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తే సమాధానం ఎవరు చెప్పాలని ప్రశ్నించారు. కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం మంచి పద్ధతి కాదని, ఆరోపణలు చేసేముందు జగన్ కూడా ఒకసారి ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గడానికి కారణం వైకాపా కాదా? అని ప్రశ్నించారు.

గుంటూరుకి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాక

Tags: Waikapa is camouflaged with false signals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *