Waikapa who distributed fruits to sanitation workers.

పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేసిన వైకాపా.

Date:23/05/2020

సత్యవేడు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా సత్యవేడులో పలువురు వైకాపా నేతలు పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా సత్యవేడు పంచాయతీ కార్యాలయం ఆవరణలో వైకాపా మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా వైకాపా రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బాలాజీ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వైయస్సార్సిపి పార్టీ ముందు ఉన్నట్టు గుర్తు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మేనిఫెస్టోలో పార్టీ పేర్కొన్న హామీలన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారు అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టి పౌర సేవలన్నీ ఒకే చోట అందేలా శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇక రాబోయే కాలంలో కూడా ప్రజల అవసరాలను గుర్తించి తదనుగుణంగా వినూత్న మార్పులు ఉంటుందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయిన నేపథ్యంలో విజయోత్సవాలను జరుపుకోవాల్సి ఉండగా లాగ్ డౌన్ కారణంగా పార్టీ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు నిరంజన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సోమశేఖర్, లాయర్ గోపీనాథ్, మస్తానమ్మ, శ్యామ్ సుందరం, సురేష్ బాబు, మాజీ సర్పంచ్ నాగరాజు, పంచాయతీ సెక్రెటరీ మునివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఓ నిండు ప్రాణం రూ. 2 వేలకు బలిఅయ్యింది.

Tags: Waikapa who distributed fruits to sanitation workers.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *