నిద్రలేపి మరీ రైలు క్రిందకు

ముంబై ముచ్చట్లు:


మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను కదులుతున్న రైలు ముందుకి తోసేశాడు. అనంతరం చిన్నారులను ఎత్తుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వే స్టేషన్ లో బల్లపై పిల్లలతో కలిసి నిద్రిస్తున్న మహిళను లేపి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. వసాయి రోడ్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. ఘటన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ముంబయి సమీపంలోని వసాయ్‌ రైల్వే స్టేషన్‌లో ఈ దుర్ఘటన జరిగింది. కాగా.. ఆదివారం మధ్యాహ్నం నుంచి నిందితుడు, మృతురాలు, ఇద్దరు పిల్లలు రైల్వే స్టేషన్‌లోనే ఉన్నారు. రాత్రి సమయంలో స్టేషన్‌లోని బల్లపైనే నిద్రపోయారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఆ వ్యక్తి మహిళను నిద్ర లేపాడు. కొంత సమయం మాట్లాడాడు. అదే సమయంలో స్టేషన్‌లోకి వస్తున్న అవధ్‌ ఎక్స్‌ప్రెస్‌ కిందకు ఆమెను గట్టిగా తోసేశాడు. ఆమె పై నుంచి రైలు వెళ్లిపోవడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.అనంతరం బల్లపై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో నిందితుడు వసాయ్ నుంచి దాదర్, తర్వాత కల్యాణ్‌కు వెళ్లాడు. చివరకు భీవండిలో పోలీసులకు చిక్కాడు.కాగా, నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద వసాయ్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Tags: Wake up and go down the train

Leave A Reply

Your email address will not be published.