కాలినడకన వెళ్లి ఓటు
గాంధీనగర్ ముచ్చట్లు:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ పరిధిలో ఉన్న రాణిప్ నిషాన్ స్కూల్లో ఆయన ఓటు వేశారు. ఓటింగ్ వెళ్తున్న సమయంలో ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి నంబర్ వచ్చిన తర్వాత ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘాన్ని కూడా అభినందిస్తున్నాను. ముందుగా ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. రెండో దశకు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని గుజరాత్ ప్రజలను, ముఖ్యంగా మహిళలు, యువతను నేను అభ్యర్థించారు.గుజరాత్ శాసనసభ ఎన్నికల రెండోదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో 89 స్థానాలకు ఈ నెల ఒకటో తేదీన ఎన్నికలు జరగ్గా, మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భాజపా, ఆప్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14జిల్లాల పరిధిలోని 93నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈనెల ఒకటిన 89స్థానాలకు పోలింగ్ జరగగా.. 63.34 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే 3శాతానికిపైగా ఓటింగ్ శాతం తగ్గింది.
Tags: Walk and vote

