స్టాఫ్ నర్సుల నియామకానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ (2-8-20)

-తిరుపతి రుయాలో,జీతం 24 వేలు

Date:31/07/2020

తిరుపతి ముచ్చట్లు :

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారివారి కార్యాలయము: చిత్తూరు జిల్లా కలెక్టరు మరియు మేజిస్ట్రేట్, చిత్తూరు వారి ఆదేశాల మేరకు కోవిడ్-19 నియంత్రణ చర్యలలో భాగంగా కోవిడ్-19 ఆసుపత్రుల నందు చికిత్సల అవసరార్థం తాత్కాలిక పద్దతి పైన నెలకు రూ.24,000/- (అక్షరాల రూపాయలు ఇరవై నాలుగు వేలు మాత్రమే) పారితోషికంతో 6 మాసాల నిడివికి పనిచేయుటకు GNM / BSc(N) / MSc(N) పట్టభద్రులు అయిన అభ్యర్థులను స్టాఫ్ నర్సుల పోస్టుల కొరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి చిత్తూరు వారిచే 02.08.2020 వ తేదీన ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 05 00 గంటల వరరు నిర్వహించనున్న Walk In interview కొరకు అర్హులైన అభ్యర్థులు వారి యొక్క ఈ క్రింద తెలుపబడిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక జత సెల్ఫ్ అన్ని అటెస్టెడ్ సర్టిఫికెట్ల జిరాక్స్ కాఫీతో పాటు లెక్చరర్ గ్యాలరీ, S.V.R.R Hospital, తిరుపతి నందు హాజరు కాగలరని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, చిత్తూరు వారు కోరుతున్నారు
Walk in Interview నందు సమర్పించవలసిన ధృవీకరణ పత్రాల వివరములు….

-పుట్టిన తేది నిర్ధారణ కొరకు పదవ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేటు

-కుల ధృవీకరణ పత్రం. అభ్యర్థులు వికలాంగులైతే సదరం వారిచే జారీచేయబడిన ధృవీకరణ పత్రము

-స్థానిక నిర్ధారణ కొరకు 4 తరగతి నుండి 10 తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు,

-GNM/BSC(N)/ MSc(N) పట్టభద్రులకు సంబంధించిన మార్ముల జాబితా

-AP Nursing Council Registration సర్టిఫికేట్స్ / రెన్యూవల్ సర్టిఫికెట్

-పాస్ పోర్ట్ సైజు ఫోటో అతికించబడిన పూరించబడిన బయోడేటా పత్రం.

-ఎంపిక ప్రక్రియ జిల్లా కలెక్టరు వారిచే నియమింపబడిన కమిటీ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయబడును.

-జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, చిత్తూరు

అంబరాన్ని అంటిన న్యాయవాదుల సంబరాలు

Tags: Walk-in interview for staff nurse recruitment (2-8-20)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *