Natyam ad

ఏసు చూపిన మార్గంలో నడవాలి 

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని సీఎస్‌ఐ హట్టన్‌మెమోరియల్‌ చర్చిలో ఫాస్టర్‌ రాఖేష్‌నిమ్రోద్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గుడ్‌ప్రైడే సందర్భంగా చర్చిలో  బోదనలు వినిపించారు. క్రైస్తవ మహిళలు, పురుషులు  ఉపవాస దీక్షతో ప్రార్థనలు ఆలాపించి , బైబిల్‌ పఠనం చేశారు. వీరికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమజిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధీన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము  కలసి ప్రార్థనలు నిర్వహించారు. ఏసుచూపిన మార్గంలో నడవాలని , కరుణ, దయ తో ప్రతి ఒక్కరిని ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫాస్టర్‌ మాట్లాడుతూ ఆదివారం ఈస్టర్‌ పండుగను భక్తిశ్రద్దలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఈ ప్రార్థనలలో క్రైస్తవ పెద్దలు రవికుమార్‌, భరత్‌భూషణ్‌, సురేష్‌ క్రిష్టఫర్‌, భాస్కర్‌, జవహార్‌, ఆర్థర్‌పాల్‌, జయకుమార్‌, హేమంత్‌, సుధాకర్‌, సత్యరాజు, చిట్టి, కృపాకర్‌, ఉదయ్‌కుమార్‌తో పాటు ఇనాయతుల్లా షరీఫ్‌, జయరామిరెడ్డి, నరసింహులు, కిజర్‌ఖాన్‌, అయాజ్‌,  రాజేష్‌, సురేష్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు ఉపవాస దీక్షల ముగింపుకు అల్పాహారం పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Walk in the path shown by Jesus

Post Midle