విద్యుత్ షాక్ తో వాకర్ మృతి
హైదరాబాద్ ముచ్చట్లు:
సికింద్రాబాద్ పద్మారావు నగర్ పార్క్ లో గత రాత్రి భారీగా కురిసిన వర్షానికి విద్యుత్ హై టెన్షన్ వైర్లు తెగి పడడంతో ఉదయం 6 గంటల ప్రాంతంలో వాకింగ్ కు వచ్చిన పార్సిగుట్ట బాపూజీ నగర్ కు చెందిన ఏ. ప్రదీప్ కుమార్ (39) చూసుకోకుండా అడుగు వేయడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు మార్చురీ కి తరలించారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
Tags;Walker died of electric shock

