నడక లోకేష్ ఆరోగ్యానికి మంచింది
శ్రీకాకుళం ముచ్చట్లు:
నడక ఆరోగ్యానికి ఎంతో మంచిదని, నారా లోకేష్ లాంటి వ్యక్తులకు ఇంకా మంచిదని యువగళం పాదయాత్రను ఉద్దేశిస్తూ రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రస్తుతం ఏమైనా సందర్భముందా అని ఆయన ప్రశ్నించారు. అధికార కాంక్ష తోనే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. మోసాలు, వెన్నుపోట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి యువనేస్తంతో రాష్ట్రంలో యువకులకు ఎంత వరకు లబ్ది చేకూర్చారో లోకేష్ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముందు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు వేస్తున్న పగటి వేషాలు నిత్యం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బాదుడే బాదుడే పేరుతో ప్రజల్లోకి వెళ్ళిన టిడిపి నేతలకు ప్రజలు తిరస్కరించారని అన్నారు.
Tags: Walking is good for Lokesh’s health

