Natyam ad

తిరుచ్చి వాహనంపై శ్రీ సత్య దేవుని ప్రాకార సేవ

అన్నవరం ముచ్చట్లు:
 
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈరోజు శనివారం సందర్భంగా శ్రీ సత్య దేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు దేవునిపల్లి ప్రసాద్ ఇంద్రగంటి సుధీర్ గర్భాలయంలో ఉన్న శ్రీ స్వామి అమ్మవార్లను తోడ్కొని వచ్చి వివిధ రకముల సుగంధభరితమైన పుష్పములతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచ్చి వాహనంపై ఆసీనులు గావించి వేదపండితుల మంత్రోచ్ఛరణ భక్తుల నామస్మరణ మధ్య మంగళవాయిద్యాల నడుమ తూర్పు గోపురం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు గావించారు. అలాగే ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ స్వామివారి  దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ ప్రాకార సేవ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ అర్చకులు, భక్తులు, ఆలయ ఏఈవో ఎం కె కే టి వి ప్రసాద్, ఆలయ సూపర్డెంట్ లు పర్వత నరేష్ , సుబ్రహ్మణ్యం, ఆర్ ఐ భాస్కర్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Wall service of Sri Satya Deva on Tiruchi vehicle