జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ

యాదాద్రి ముచ్చట్లు:
 
65వ నెంబర్ జాతీయ రహదారిపై పండగ సందడి మొదలైంది. పట్నం నుండి భాగ్యనగర వాసులు సంక్రాంతి పండగకు పల్లెలకు బయల్దేరడంతో జాతీయ రహదారి వెంట వాహనాల రద్దీ ప్రారంభమైంది.  వాహనాలు పంతంగి టోల్ ప్లాజా దాటుకొని వెళ్లడానికి సమయం పడుతుంది. ఫాస్ట్ ట్రాక్ బార్కోడ్ రీడ్ చేయడానికి ఆలస్యం అవుతుండడంతో… టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ప్రారంభమైన వాహనాల రద్దీ ఇరవై నాలుగు గంటల పాటు ఉండే అవకాశం ఉంది.  వాహనాల రద్దీ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ట్రాఫిక్ స్థానిక పోలీసులు, టోల్ ప్లాజా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Wallpapers congestion on the national highway

Natyam ad