మున్సిపాలిటిలో సంక్రాంతి సందడి

Wallpapers in the municipality

Wallpapers in the municipality

– మహిళలచే ముగ్గుల పోటీలు
– విజేతలకు పెద్దిరెడ్డిచే బహుమతులు

Date:13/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

నూతన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను అమలు చేసేందుకు ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు, తహశీల్ధార్‌ వెంకట్రాయులు ఆధ్వర్యంలో సోమవారం బసవరాజ ప్రభుత్వ హైస్కూల్‌లో వంటలు, ముగ్గులపోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, అక్కిసాని బాస్కర్‌రెడ్డి, కొండవీటి నాగభూషణం, నాగరాజారెడ్డి, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డిలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా మహిళలు అత్యంత సుందరంగా రంగోలి పోటీలు నిర్వహించారు. బోగిమంటలు వెలిగించారు. పొంగళ్లు తయారు చేశారు. ఎడ్లబండికి పూజలు చేసి ప్రదర్శన చేశారు. గంగిరెద్దులు , గొబ్బెమ్మల పాటలతో సంక్రాంతి సందడి నిర్వహించారు. అలాగే విద్యార్థుల సాంస్క్రృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ విధానాలపై పాటల పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలలో గెలుపొందిన వారికి పెద్దిరెడ్డి బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు హాజరైన మహిళలకు అభినందనలు తెలిపారు. మహిళలు ఇదే విధంగా అన్ని రంగాలలోను ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దేశిదొడ్డి ప్రబాకర్‌రెడ్డి, పార్టీ నేతలు రామచంద్రారెడ్డి, ఖాదర్‌బాషా, ఎంసీవో రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

విజేతలు….

మండల స్థాయిలో జరిగిన వంటల పోటీలలో వెహోదటి బహుమతి దీపారాణి ఏటవాకిలి , ద్వితీయ బహుమతి సుమిత్ర పాళ్యెంపల్లె, తృతీయ బహుమతి దొరసాని సిఎం.పల్లె, అలాగే ముగ్గుల పోటీలలో వెహోదటి బహుమతి పద్మావతి ఏతూరు, ద్వితీయ బహుమతి లక్ష్మిదేవి రాగానిపల్లె, తృతీయ బహుమతి చంద్రమ్మ భీమగానిపల్లెలకు అందజేశారు. వీరితో పాటు కళావతి మాగాండ్లపల్లె మహిళకు ప్రోత్సాహక బహుమతి అందజేశారు.

పల్స్ పోలియో ను విజయవంతం చేయండి

Tags: Wallpapers in the municipality

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *