వామ్మో…ఇదేం రోడ్డు

Wammy ... this is the road

Wammy ... this is the road

Date:14/07/2018
మెదక్ ముచ్చట్లు:
మారుమూల పల్లెలకు బీటి రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా చర్యలు చేపడుతుంది. కానీ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్షంతో ప్రజా ప్రతినిధుల మాటలను పెడచెవిన పెట్టి పనులు చేయడంతో పూర్తిగా అసమర్ధతతను చాటుతూ ప్రభుత్వ పరువుతీస్తున్నారు.రోడ్డు పనులు చేపట్టి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు స్పందించక పోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగిన, స్థానిక ఎమ్మెల్యే మధన్‌రెడ్డిని సమస్య పరిష్కరించాలని కోరినప్పటికీ పనుల్లో చలనం లేదు. ఇటీవల జలాల్‌పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్త అసంపూర్తిగా రోడ్డు వల్లే ద్విచక్రవాహనం బోల్తా కొట్టి చనిపోయాడు. వాహనాలు రోడ్డుపై నుండి వెళ్తుంటే కళ్లలో దుమ్ముపడి నానా అవస్థలు పడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని సంగాయిపేట నుండి దుంపలకుంట చౌరస్తా వరకు దాదాపు 4.5 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా అస్థవ్యస్థంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తొలుతలో ఇట్టి రోడ్డుకు 6 కోట్ల రూపాయల వ్యయంతో టెండర్లు నిర్వహించగా ఆర్కె కన్‌స్ట్రక్షన్ వారు ముందుకు వచ్చి టెంటర్ చేజిక్కిచ్చుకొని రోడ్డు నిర్మాణ పనులను మొదలు పెట్టి పెట్టగానే చేతులేత్తేసారు. అప్పటి నుండి ఆ రోడ్డు పరిస్థితి దిన దినం పూర్తిగా అధ్వానంగా మారి వాహనాలు నడువలేని స్థితికి చేరుకుంది. లోతైన గుంతలు, కంకరతో కూడుకున్న అట్టి రోడుపై ప్రయాణిస్తూ పదుల సంఖ్యలో ప్రమదాలు జరగడంతో పాటు ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోపగా మిగతవారు కాళ్లు, చేతులు విరగొట్టుకొని మంచాన పడ్డారు. ఇట్టి విషయమై చుట్టు పక్కల గ్రామస్తులు ఎన్నో సార్లు ఆందోళన చేపట్టడంతో పాటు నిరసనలు తెలిపి రోడ్డుపై బైటాయించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రోడ్డు పనులు వెంటనే చేపట్టి సరి చేయాల్సిందిగా స్థానికులు కోరినప్పటికీ కాంట్రాక్టర్లు లేకపోవడంతో అట్టి పనులు ఇప్పటికే పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ విషయమై ఆర్ అండ్ బి అధికారులను విచారిస్తే తామేమీ చేయలేమని, ఇప్పటికే రెండు సార్లు టెండర్లు చేజిక్కిచ్చుకున్న కాంట్రాక్టర్లు మధ్యలోంచే చేతులెత్తయడంతో ప్రస్తుతం పనులు మధ్యాంతరంగా నిలిచిపోయాయన్నారు. త్వరలోనే మరోమారు మూడోసారి టెండర్లు నిర్వహిస్తామని తెలియజేస్తూ అప్పటివరకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని బదులిచ్చారు. మెదక్ – జోగిపేట ప్రధాన రహదారైనా ఈ మార్గమధ్యంలో ద్విచక్ర వాహనదారులు కుటుంబసమేతంగా వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వ టెండర్లకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లకు రోడ్డ నిర్మాణాపనులను సంపూర్ణంగా చేపట్టి మెదక్ – జోగిపేట ప్రధాన రహదారిలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష నాయకులు ఎన్నోసార్లు స్థానిక ఎమ్మెల్యేలను అట్టుకొని తమ సమస్య పరిష్కరించాల్సిందిగా కోరగా స్థానిక నేత సరేనంటూ బదులిచ్చి అధికారులను అప్రమత్తం చేసి టెండర్లను నిర్వహించమని కోరినప్పటికీ ఎవరు ముందుకు రాకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలక్షన్ కోడ్ మొదలైతే ఇట్టి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతాయా అనే సందేహాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రభుత్వం ప్రజావసరాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ అధికారులు సరైన విధంగా స్పందించకపోవడంతో ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి జిల్లాలో నెలకొంది. వెంటనే జోగిపేట – మెదక్ రహదారుల మార్గమధ్యంలోని సంగాయిపేట నుండి రంగంపేటల మీదుగా దుంపలకుంట వరకు రోడ్డు నిర్మాణాలు చేపట్టి వెంటనే బీటి రోడ్డు వేయవల్సిందిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.
వామ్మో…ఇదేం రోడ్డుhttps://www.telugumuchatlu.com/wammy-this-is-the-road/
Tags: Wammy … this is the road

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *