పర్యాటక కేంద్రంగా వంగర అభివృద్ధి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

Date:22/01/2021

హైదరాబాద్  ముచ్చట్లు:

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ మాజీ భారత ప్రధాని, సాహితీవేత్త పివి నరసింహ రావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ఈ క్రమంలో పివినరసింహ రావు స్వగ్రామమైన  వంగర ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పర్యాటక, సాంస్కృతిక, హెరిటేజ్ తెలంగాణ శాఖ ఉన్నతాధికారులతో గ్రామాన్ని సందర్శించి అక్కడ పర్యాటక ప్రదేశంగా రూపొందించడానికి కావాల్సిన కార్యచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. స్వర్గీయ భారత ప్రధాని పీవీ నరసింహారావు గారి ఇంటిని మ్యూజియంగా రూపొందించడం. రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు, అక్కడ స్థానికంగా విజ్ఞాన వేదిక థీమ్ పార్క్ ను  ఒక విన్నూత్న మైన ఆలోచనలతో  రూపొందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు.

 

 

వంగర  గ్రామం ను ఆదర్శ గ్రామంగా రూపొందించటానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  పివి ప్రవేశపెట్టిన సంస్కరణలు భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఈ విజ్ఞాన కేంద్రంలో ప్రతిబించేలా ఉంటాయన్నారు మంత్రి పీవీ ఎన్నో సంస్కరణల తీసుకొచ్చారన్నారు. ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. పివి శత జయంతి వేడుకలను ఇతర రాష్ట్రాల తో పాటు విదేశాల్లో కూడా పీవీ శతజయంతి ఉత్సవాలు  నిర్వహిస్తున్నామన్నారు. పివి విజ్ఞాన వేదిక కోసం 7 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామన్నారు. అవసరమైతే ఇంకా నిధులను కేటాయిస్తామన్నారు. వచ్చే నెల రోజుల్లో వంగర లో విజ్ఞాన కేంద్రం థీమ్ పార్క్ కు శంకుస్థాపన చేస్తామన్నారు.

పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

Tags: Wangara development as a tourist destination: Minister Srinivas Gowda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *