నీరుగారుతున్న ‘ఆదరణ’

Waning 'rejoicing'

Waning 'rejoicing'

Date:10/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
అన్నివర్గాల ప్రజలను అభివృద్ధిలో భాగం చేయడమే కాకుండా వారు ఆర్ధికంగా  నిలదొక్కుకోడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే చేతివృత్తులపై ఆధారపడి జీవనం సాగించేవారి కోసం ఆదరణ పథకాన్ని అమలు చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా లబ్ధిదారులకు మాత్రం ఆదరణ పథకం ఆదరువుగా నిలువలేకపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడుగుల పేరుచెప్పి కొందరు కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వృత్తిపనులపై ఆధారపడ్డవారికి ఆర్ధికంగా చేయూతనివ్వాలన్న ధ్యేయంతో పనులకు అవసరమైన పనిముట్లు సమకూర్చుకునేందుకు రాయితీపై రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీరికి లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాకపోవడం సమస్యాత్మకంగా మారింది.
రుణం ఇచ్చేందుకు అంగీకరించినా సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. రుణం పొందాలంటే తప్పనిసరిగా ష్యూరిటీ చూపించాలంటున్నారని… నిరుపేదలమైన తమకు ఇలాంటి ష్యూరిటీలు ఎక్కడ లభించగలవని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చేతివృత్తుల వారికి రుణాలు దక్కడం గగనమైపోయిందని ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఆదరణ పథకం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు ప్రయోజనాలు చేకూరేలా చర్యలు తీసుకుంది.
అయితే పలువురు ప్రతిపక్ష నేతలు ఈ పథకాన్ని ఎన్నికల స్టంట్‌గా పేర్కొంటున్నారు. ఈ ప్రోగ్రామ్ కాంట్రాక్టర్లకు మేలు చేసేదిగా ఉందని.. అసలైనవారికి ఫలితం దక్కడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పథకం ద్వారా వృత్తిదారులకు అందిస్తున్న పనిముట్లు మార్కెట్ ధర కన్నా ఎక్కువగా ఉంటున్నట్లు కొందరు అంటున్నారు. అంతేకాక నాణ్యత లేమి కూడా ఉంటోందని చెప్తున్నారు. వీటిని లబ్ధిదారులకు అంటగట్టి కాంట్రాక్టర్లు, అధికారులు కమిషన్లు పంచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికార యంత్రాంగం స్పందించి  నాణ్యతతో కూడిన పరికరాలను అందించేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Tags:Waning ‘rejoicing’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed