`ఉన్మాది` గురించి తెలుసు కోవాలా

Want to know about `unmadhi`

Want to know about `unmadhi`

 Date:05/02/2019

సినిమా ముచట్లు:
పోలీస్ అంటే ర‌క్ష‌ణ‌. ఆప‌ద‌లో ఉన్న వారికి అభ‌య హ‌స్తం అందించి ర‌క్ష‌ణ అందించే పోలీసులు క‌ర్క‌శంగా ఉన్మాదిగా ఎందుకు మారాడు? అస‌లు అలా మార‌డానికి దారి తీసిన ప‌రిస్థితులేంటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే `ఉన్మాది` సినిమా చూడాల్సిందే అంటున్నారు ద‌ర్శ‌కుడు ఎన్‌.ఆర్.రెడ్డి. ప్రవీణ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై  ప్రొడ‌క్ష‌న్ నెం.2గా ఎన్‌.కరణ్‌ రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘ఉన్మాదిస‌. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల‌వుతోంది.  ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఎన్‌.ఆర్‌.రెడ్డి మాట్లాడుతూ – ”ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ. సినిమా పూర్తి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. డేవిడ్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లు, ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశాం.
చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేయ‌బోతున్నాం“ అన్నారు. టైటిల్‌ పాత్రలో ఎన్‌.ఆర్‌.రెడ్డి నటిస్తూ దర్శకత్వం వహించారు. అల్లు రమేశ్‌, శివ, శిరీష, నాగిరెడ్డి, రమ్య, ప్రమీల, పుష్పలత, సోను, రాజేశ్వరి, డిఎస్‌పి, వెంకటాంజనేయులు, ఫణి సూరి, మున్నా, జానకి రామయ్య తదితరులు మిగతా పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్‌, కెమెరా: దంటు వెంకట్‌, ఎడిటర్‌: కె.ఎ.వై.పాపారావు, ఫైట్స్‌: దేవరాజ్‌, కొరియోగ్రఫీ: సామ్రాట్‌, జోజో, నిర్వహణ: ఎన్‌.వరలక్ష్మి, క్రియేటివ్‌ డైరెక్టర్‌ : రాఘవ, నిర్మాత: ఎన్‌.రామారావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్‌.ఆర్‌.రెడ్డి.
Tags:want-to-know-about-unmadhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *