ముస్లింలను అణచివేసేందుకు బిజెపి చట్టాలు చేస్తే చూస్తూ ఊరుకోం..

Want to see if BJP makes laws to oppress Muslims ..

Want to see if BJP makes laws to oppress Muslims ..

– అంబేద్కర్‌ ఆశించిన ప్రజాస్వామ్యం ఇదేనా…?
– బిల్లు రద్దు కోసం ప్రాణత్యాగాలకైన సిద్దం
– ఫకృద్ధిన్‌షరీఫ్‌ హెచ్చరిక

Date:14/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజాస్వామ్యదేశంలో బిజెపి ప్రభుత్వం ముస్లింలకు మనుగడ లేకుండ చేసేందుకు ఒక పథకం ప్రకారం చట్టాలు చేస్తే…. మేం చూస్తూ ఊరుకోం….అవసరమైతే ప్రాణత్యాగాలకైన సిద్దపడుతాం ముతవల్లి ఫకృద్ధిన్‌షరీఫ్‌ హెచ్చరించారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలోముస్లింలు ఇందిరాసర్కిల్‌లోనాల్గవ రోజు నిరాహారదీక్షలు కొనసాగించారు. ఈ దీక్షలకు సంఘీబావం తెలుపుతూ వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, మాజీ ఎంపీటీసీ హేమచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ద్వేషంవద్దు…దేశంముద్దు….మతంఆధారంగా పౌరసత్వం వద్దు… ఎన్‌ఆర్‌సి,సీఐఏ, ఎన్‌ఆర్‌పి రద్దుపరచండి…. రాజ్యాంగాన్నికాపాడండి…. దేశాన్నివిభజించ వద్దు అన్న నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దీక్షా శిబిరంలో షరీఫ్‌ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ ఆశించిన ప్రజాస్వామ్య దేశంలో ముస్లిం మతస్తులకు మనుగడ లేకుండ చేసేందుకు పౌరసత్వం బిల్లును తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ బిల్లును రద్దు చేయాలంటు దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధకరమన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై చర్యలు తీసుకుని పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. లేకపోతే ప్రాణత్యాగం చేసైనా బిల్లును రద్దు చేయించేందుకు ముస్లింలు సిద్దమౌతామని పేర్కొన్నారు. ఈనెల 19న ఎన్‌ఎస్‌.పేటలో జరుగుతున్న బహిరంగ సభకు అన్ని మతాలు, కులాలకు చెందిన ప్రజలు హాజరై కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాలని పిలుపునిచ్చారు.

15న మంత్రి పెద్దిరెడ్డి పర్యటన

Tags: Want to see if BJP makes laws to oppress Muslims ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *