Waqf lands in Kabbalah

కబ్జా కోరల్లో వక్ఫ్ భూములు

– 6900 ఎకరాల్లో 5 వేలకు పైగా దురాక్రమణ

Date:15/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు నగరం లో వక్ఫ్ బోర్డు కు చెందిన భూములు చాలా ఉన్నాయని,ఈ నగరం లో వక్ఫ్ బోర్డు కు చెందిన వందల ఎకరాలు భూములు ఉన్నాయి అయితే అవి ఎక్కడున్నాయో ఎవరి చేతుల్లో వున్నాయో కూడా తెలీని పరిస్థితి నెలకొన్నదని రాష్ట్ర మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆయుబ్ అలీఖాన్ పేర్కొన్నారు. అలాగే ఒక్క చిత్తూరు లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల వక్ఫ్ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయని,పట్టించుకుని చర్యలు తీసుకునేందుకు యంత్రాంగమనేదే లేకపోవడం తో విలువైన భూములు సునాయానంగా పరాధీనమైపోతున్నాయన్నారు. జిల్లాలో వక్ఫ్ బోర్డు కు చెందిన భూములు 6900 ఎకరాలుండగా అందులో కేవలం 1200 ఎకరాలు మాత్రమే వక్ఫ్ బోర్డు ఆధీనం లో వున్నాయి .సాక్షాత్తూ అధికార యంత్రాంగమంతా కేంద్రీకృతమై వుండే జిల్లా కేంద్రంలోనే వక్ఫ్ భూములకు రక్షణ లేకుండా పోయిన నేపథ్యంలో జిల్లాలోని మిగిలిన ప్రాంతాల గురించి ప్రత్యకంగా చెప్పేదేముందన్నారు. అందుబాటులో వున్న రికార్డులు మేరకు జిల్లాలో 6900 ఎకరాలు నేరుగా వక్ఫ్ బోర్డు పరిధి లో వున్నాయి. ఇవి కాక అదనంగా మాన్యం భూములున్నాయి. వక్ఫ్ బోర్డు కు చెందిన 6900 ఎకరాల్లో సుమారు 5 వేల ఎకరాలు ఒక గుర్రంకొండ మండలంలోనే వున్నాయి. తిరుపతి , రేణిగుంట, చిత్తూరు,మదనపల్లి, పుంగనూరు,పలమనేరు,పీలేరు వంటి నగరాలు,పట్టణాల్లో రూ.కోట్లు ఖరీదు చేసే భూములున్నాయి. మొత్తం 6900 ఎకరాల్లో ఇపుడు వక్ఫ్ బోర్డు ఆధీనంలో వున్నవి. కేవలం 1200 ఎకరాలే,మిగిలినవి ఇతరుల స్వాధీనానుభవంలో వున్నాయన్నారు.

 

 

 

 

 

 

 

 

 

ప్రభుత్వ రికార్డులో పేర్కొన్న భూముల్లో ఇవాళ ఇతరులకు చెందిన భారీ భవంతులు,వ్యాపార సముదాయాలు ఫామ్ హౌస్లు,కొలువు దీరాయని,చిత్తూర్ నగర శివార్లలోని తేనే బండ వద్ద సర్వేనంబర్లు 1,3,4,5లలో 90.37 ఎకరాల వక్ఫ్ భూమి వుంది . త్రీ స్టార్ హోటల్ బాన్స్ కు సమీపం లో వున్న ఈ భూమి బహిరంగ మార్కెట్ విలువ రూ.వంద కోట్ల పైమాటేనని,ఇంతటి ఖరీదైన భూమిలో సెంటు కూడా ఇపుడు వక్ఫ్ బోర్డు స్వాధీనం లో లేదన్నారు.ఈ భూమిలో ప్రస్తుతం ఇతరులు ఆ స్థలంలో మామిడి తోట అభివృద్ధి పరుస్తున్నారు.నగర శివార్ల సంగతి పక్కన పెడితే నగర నడిబొడ్డున వున్న భూములు కూడా పరాధీనమయ్యాయి. ఎంజీఆర్ వీధిలోని కిచిడిషా మకాన్ కు చెందిన 40 ఎకరాల భూమి కేవలం రికార్డులో మాత్రమే పరిమతి అయ్యిందని అలాగే సంత పేట మసీదు కు చెందిన 5 ఎకరాలు , ఏటిగట్టు ఈశ్వరుని గుడి సమీపంలో 4.70 ఎకరాల భూములు ఆక్రమణకు గురై కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయన్నారు. మండి వీధిలో పిసిఆర్ కళాశాల వెనుక వైపు సర్వే నెంబర్ 60లోని 6.70 ఎకరాల ఖరీదు బహిరంగ మార్కెట్ రూ వంద కోట్లకు పైనే వుంటుంది. జిల్లా వ్యాప్తంగా వందలాది ఉదాహరణలున్నాయి . రేణిగుంట,పలమనేరు , మదనపల్లి పట్టణాల్లో ఆక్రమణలకు గురైన భూములకు సంబందించిన సుమారు 30 దాకా కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్లో వున్నాయని,గురువారం సెంట్రల్ మినిస్టర్ ముక్తార్ అబ్బాస్ నక్వి వారి తో ఆంధ్ర ప్రదేశ్ లో వక్ఫ్ భూములు ఆక్రమణకు గురి అవుతున్న దాన్ని గురించి చర్చించడం జరిగిందన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే న్యాయం చేస్తారన్నారు.

 

లింబద్రి గుట్ట జాతరలో విషాదం చోటు

 

Tags:Waqf lands in Kabbalah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *