బండికి సీనియర్ల మధ్య వార్

కరీంనగర్ ముచ్చట్లు:
 
కరీంనగర్ జిల్లా బీజేపీలో కొంతకాలంగా బండి సంజయ్, పార్టీలో సీనియర్లుగా చెప్పుకొంటున్నవారి మధ్య వార్‌ కొనసాగుతోంది. సంజయ్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాలను పార్టీ పెద్దలు సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అసమ్మతి వాదులపై యాక్షన్‌ వద్దనుకున్నారో ఏమో.. అటు నుంచి రియాక్షన్‌ లేదు. దాంతో సంజయ్‌ వ్యతిరేకవర్గం స్పీడ్‌ పెంచినట్టు సమాచారం. తగ్గేదే లేదన్నట్టుగా జిల్లా వ్యాప్తంగా ఓ వర్గం పనిచేస్తోందట. తమ ఉనికిని కాపాడుకునేందుకు ఉన్న మార్గాలను ఎంచుకుంటున్నారట.బీజేపీలో సీనియర్‌గా ఉన్న పొలసాని సుగుణాకర్‌రావు కన్వీనర్‌గా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పోరాట సమితి పేరుతో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారట. ఆ కమిటీ పేరుతో నిరసన కార్యక్రమాలు చేయడం బీజేపీ శ్రేణుల్లో చర్చగా మారింది. అయితే పార్టీ పేరుతో కాకుండా స్వతంత్రంగా ధర్నాలుకు దిగుతున్నారట. దీనిపై బీజేపీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సమస్య కాషాయ శిబిరంలో సెగలు రేపుతోందట. సంజయ్‌ పొలిటికల్‌ తెరపైకి నిలబడటానికి ముందు జిల్లాలో బీజేపీని తామే నిలబెట్టామని.. అలాంటిది తమను అన్ని విధాలుగా పక్కన పెట్టేశారని గుర్రుగా ఉన్నారట అసంతృప్తివాదులుఇప్పుడు వేములవాడ ఆలయం సాక్షిగా బీజేపీ అంతర్గతపోరు మరోసారి బయటపడటంతో రానున్న రోజుల్లో సంజయ్‌కు మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చని చెవులు కొరుక్కుంటున్నారు. ఆ మధ్య బండి సంజయ్‌ వేములవాడ నుంచి అసెంబ్లీ పోటీ చేస్తారని ప్రచారం. జరిగింది.
 
 
దాంతో అసంతృప్తి వర్గం వేములవాడపై ఫోకస్‌ పెట్టినట్టు చర్చ సాగుతోంది. దీంతో బీజేపీ పెద్దలు అప్రమత్తమై నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారట. వేములవాడ రాజన్న అభివృద్ధి పోరాట సమితికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రకటన చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ పోరాట సమితి పేరుతో నిర్వహించిన ధర్నాకు బీజేపీ నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. దాంతో పార్టీ నేతలు హడలిపోయారట. కార్యక్రమానికి వచ్చిన వారిపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సొంత జిల్లాలో రేగిన అసంతృప్తి చాపకింద నీరులా పాకడం.. రోజుకో కొత్త వేదిక ఏర్పాటు చేసుకుని సవాళ్లు విసరడం పార్టీలో గుబులు రేపుతోందట. మరి.. అసమ్మతి వాదులపై బీజేపీ హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
 
Tags: War between the cart seniors

Leave A Reply

Your email address will not be published.