తాడిపత్రి లో మరోసారి మాటల యుద్ధం
అనంతపురం ముచ్చట్లు:
టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. తాను పాదయాత్ర చేస్తుంటే.. ఓర్వలేకనే కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ బ్రదర్స్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వివరాల్లోకి వెళితే.. పెద్దారెడ్డి చేస్తున్న పాదయాత్రలో కరపత్రాలు కలకలం రేపాయి. ప్రజలకు పెద్దారెడ్డి ఏం చేశారో చెప్పాలంటూ అందులో పేర్కొన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి.. జేసీ బ్రదర్స్ పై భగ్గుమన్నారు. తాను పాదయాత్ర చేస్తుంటే.. ఓర్వలేకనే కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఫ్యాక్షన్ గొడవలు పెట్టడానికే కరపత్రాలు పంచుతున్నారని పెద్దారెడ్డి దుయ్యబట్టారు. జేసీ ఇంటి లొకి పోయినోని బేడ్ రూమ్ లొకి పోలేనా అని తనది ఆ సంస్కృతి కాదని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
Tags: War of words once again in Tadipatri

