వర్షంతో  చిత్తడయున వరంగల్

వరంగల్ ముచ్చట్లు:
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా  భారివర్షం కురుస్తోంది. రుతుపవనాల రాకతో ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసి ముద్దయింది. తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం తన ప్రభావం చూసించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం మారాయి ఇక నగరంలో పలు కాలనీలు నీటమునిగాయి.  ఇళ్లలోకి నీళ్లు రావడంతో  పలు కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ కు వచ్చిన ధాన్యాలు తడిసి ముద్దయ్యాయి. గ్రామాలలోని ఐ కెపి సెంటర్ లలో వరి ధాన్యం తడిసింది  ఏజెన్సీ ప్రాంతాల్లో చెట్లు కూలి  విద్యుత్ సరఫరా నిలిచిపోయింది  హన్మకొండలోని వంద ఫీట్ల రోడ్ నీట మునిగింది. హౌసింగ్ బోర్డ్ కాలనీ, నక్కలగుట్టలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఓ మోస్తారు వర్షానికే వరంగల్ నగరం ఇలా ఐతే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయపడుతున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Warangal swamp with rain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *