వార్డ్, గ్రామ సచివాలయ ఉద్యోగుల కేవ్వకి అన్యాయం జరగదు
తిరుపతి ముచ్చట్లు:
డైరెక్ట్టర్ సన్ మోహన్ హామీ రాష్ట్రం లో గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ఎవ్వరికి అన్యాయం జరగదని అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని ప్రొబేషన్ జాబితాలో పెడతామని వై ఎస్ ఆర్ టీ యూ సి రాష్ట్ర నాయకులకు గ్రామ, వార్డ్ సచివాలయ సంస్థ డైరెక్ట్టర్ షన్ మోహన్ హామీ ఇచ్చారు. బుధ వారం ఉదయం వై ఎస్ ఆర్ టీ యూ సి రాష్ట్ర అధ్య క్షులు డా. పూ నూరు గౌతమ్ రెడ్డి అదేశాల మేరకు మంగళగిరి లోని ఐ హెచ్ సి భవన్ లో స్టీల్ కార్పొరేషన్ వై ఎస్ ఆర్ టీ యూ సి రాష్ట్ర ప్రధాన కార్య దర్శులు వై. వెంకటప్ప రెడ్డి, ఎన్. రాజా రెడ్డి, వై ఎస్ ఆర్ సి పీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు నరహరి సెట్టి శ్రీహరి లు గ్రామ వార్డ్ సచివాలయ డై రెక్టర్ షన్ మోహన్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు ఎన్. రాజా రెడ్డి, వెంకటప్ప రెడ్డి, శ్రీహరి లు మాట్లాడుతూ ప్రొబేషన్ గతంలో లిస్ట్ ప్రకటించ లేదని కొంతమంది ఉద్యోగులను తప్పుదారి పట్టిం చడం వలన ఆవగాహన లోపం వలన ఒక్క రోజు ప్రభుత్వ ఆప్ ల నుండి వచ్చారనే నెపం తో రాష్ట్ర వ్యాప్త ముగా మూడు వేల మందిని ప్రొబేషన్ జాబితాలో లేనట్లు మా ద్రుష్టి కి వచ్చిందని వారందరూ ఈ రెండు సంవస్తరాలు కష్టపడి పని చేసారని మీరు వారి మీద దయ చూపి ప్రొబేషన్ జాబితాలో పెట్టాలని కోరారు. దీనిపై స్పందించిన డైరెక్టర్ షన్ మోహన్ స్పందిస్తూ ముఖ్యమంత్రి హామీ మేరకు అందరికీ న్యాయం జరుగుతుందని ఎవ్వరికి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.
Tags: Ward and Gram Secretariat employees will not be treated unfairly