రామసముద్రంలో గుండెపోటుతో వార్డ్ మెంబర్ మృతి
రామసముద్రం ముచ్చట్లు:
రామసముద్రం మండలం రాగిమాకులపల్లి పంచాయతీ కు చెందిన వార్డ్ మెంబర్ శ్రీనివాసులు రెడ్డి (58)లు ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడుమృతుడు వైఎస్సార్ సీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అయితే శ్రీనివాసులురెడ్డికి కొంత అనారోగ్యానికి గురి కావడంతో నాలుగు రోజుల క్రితం మదనపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటుండేవాడు. అయితే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. శ్రీనివాసులురెడ్డి మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు విషాదం మునిగారు.

Tags; Ward member died of heart attack in Ramasamudra
