Natyam ad

వార్డుమెంబరుకాలేవ్‌…నీవా మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించేది 

-అభివృద్ధి గురించి గ్రామాల్లోకి వెళ్లదాం..దమ్ముంటే రా..

-మంత్రిని విమర్శిస్తే పబ్లిసిటి రాదు…

-తరిమికొడతారు

Post Midle

– రామచంద్ర యాదవ్‌కు వైసిపి నేతల హెచ్చరిక

 

పుంగనూరు ముచ్చట్లు:

నీయోగ్యతకు…వార్డు మెంబరు కాలేవ్‌… నీవురాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను విమర్శిస్తావా..ఐదేళ్లలో పుంగనూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల గురించి పరిశీలించేందుకు నీకు దమ్ముంటే రా… గ్రామాల్లోకి వెళదాం…సాగునీరు-తాగునీరు కోసం ప్రభుత్వం  రెండు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే పచ్చగ్యాంగ్‌తో కలసి పనులు ఆపివేయించింది నీవుకాద అంటు బిసివై నాయకుడు రామచంద్ర యాదవ్‌పై వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం మండల కార్యాలయంలో  ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రామచంద్ర యాదవ్‌ చదళ్ల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంభాన్ని , ప్రభుత్వాన్ని విమర్శించడంపై మండిపడ్డారు. 2019 ఎన్నికలలో ఓట్ల కోసం టోకెన్లు ఇచ్చి ప్రజలు కొడతారని పత్తాలేకుండ పోయి, పబ్లిసిటి కోసం మంత్రి కుటుంభాన్ని విమర్శించడం చేస్తే సహించేది లేదన్నారు. నియోజకవర్గంలోని ఏగ్రామానికి వెళ్లినా అభివృద్ధి పనులు కనిపిస్తుందని భాస్కర్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. పుంగనూరును ఆదర్శ నియోజకవర్గంగా ఏర్పాటు చేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి లు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎంపీ మిధున్‌రెడ్డి రైల్వేలైను కోసం ఎంతో శ్రమించారని తెలిపారు. బైపాస్‌రోడ్డు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయడం, ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ఏర్పాటు చేయడం రామచంద్ర యాదవ్‌కు తెలియదా అంటు ప్రశ్నించారు.

 

 

తనకు అవకాశం ఇస్తే పరిశ్రమలు, పాలడైరీలు, చింతపండు , టమోటా రైతులను ఆదుకుంటామని రామచంద్రయాదవ్‌ ప్రకటించడం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. ఐదేళ్లుగా ఏగ్రామానికి వెళ్లావ్‌… ఎన్ని గ్రామాలు ఉన్నాయో నీకు తెలుసా…? అంటు ఎద్దెవా చేశారు. వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ మంత్రి కుటుంబం అవినీతికి పాల్పడిందని రుజువు చేయగలవా అంటు నిలధీశారు. వేల కోట్లు ఖర్చు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. యాదవ్‌ పచ్చగ్యాంగ్‌తో కలసి ఆరోపణలు చేస్తే ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. 30 సంవత్సరాలు పాలించిన కుటుంబం పుంగనూరు అభివృద్ధిని పట్టించుకోలేదని వెంకటరెడ్డి యాదవ్‌ తెలిపారు. అలాంటి వారితో రామచంద్ర యాదవ్‌ కుమ్మకై మంత్రి కుటుంభాన్ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శులు చంద్రారెడ్డి యాదవ్‌, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీసీ నాయకుడు సుబ్రమణ్యం పాల్గొన్నారు.

 

Tags:Wardumemberukalev… used to criticize Neva Minister Peddireddy
Post Midle