వామ్మో… సర్కారీ ఇంగ్లీషు మీడియం స్కూల్స్

Warmo ... Circular English Medium Schools

Warmo ... Circular English Medium Schools

Date:20/09/2018
విజయనగరం ముచ్చట్లు:
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్య కొత్త కుండలో పాత నీరు అన్నచందంగా మారింది. విద్యా సంవత్సరం ఆరంభంలో బీరాలు పలికిన విద్యాశాఖ వాటి అమలులో కొత్తదనం చూపించలేకపోవడంతో ఆకట్టుకోలేకపోయింది.  విద్యాశాఖ ఉన్నతాధికారులు ముందుగా ఏయే పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభిస్తారన్న వివరాలు సేకరించి ప్రయోగాత్మకంగా ఇంగ్లిష్‌ మీడియం విద్య ప్రారంభించినా అనుకున్న లక్ష్యం నేరవేరడం లేదు.
ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభించినప్పటికీ కొత్త ఉపాధ్యాయులను నియమించలేదు సరికదా.. ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వలేదు.  దీంతో విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం విద్య అందకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కార్పొరేట్‌ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలు చేస్తామన్న పాలకులు, అధికారుల హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టి మూడు నెలలు గడిచిపోతున్నా కనీసం 1వ తరగతికి అవసమైన పాఠ్య పుస్తకాలు అందించలేకపోయారు.
అలాగే ఉపాధ్యాయులను కూడా నియమించలేకపోయారు. ఎటువంటి కొత్తదనం ప్రణాళికలు లేకుండా ఆచరణలోకి దిగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలంటే అంగన్‌వాడీ కేంద్రాల్లో చదు వుతు న్న మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులను పూర్వ ప్రాథమిక పాఠ శాలలకు అనుసంధానం చేయాలని నిర్ణయించింది.
ఇప్పటికే గ్రామాలలో కేం ద్రాలను అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేసేందుకు అనువైన పా ఠశాలలను గుర్తించిన అధికారులు నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు.  విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళకుండా ప్రభుత్వం పాఠశాలల్లోనే చదువుకొనసాగించ నున్నారు.
అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడం ద్వారా వారికి మరింత బాధ్యత పెంచాలని భావిస్తోంది.మూడేళ్ళు దాటిన చిన్నారులను వారి తల్లిదండ్రులు ఆంగ్లం మోజులో ఇంగ్లీషు మీడియం మోజులో ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.
Tags:Warmo … Circular English Medium Schools

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *